Breaking News

బాస్ టీ- షర్ట్‌తో చిరంజీవి ఇంట యువ హీరో సందడి.. 'గల్లీ రౌడీ' వేషాలు మామూలుగా లేవండోయ్!!


విలక్షణ కథల్లో నటిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న యంగ్ హీరో .. తన కెరీర్‌ బ్రేక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఎలాగైనా బిగ్గెస్ట్ హిట్ పట్టేసి హీరోగా కెరీర్ టర్న్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు వరుస సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ''గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. సందీప్ కిషన్- హీరోహీరోయిన్లుగా రూపొందిన 'గల్లీ రౌడీ' సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్త సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. మెగాస్టార్ సపోర్ట్ అందుకుంది. ఆదివారం చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఇందుకోసం చిత్ర యూనిట్ అంతా చిరు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో హీరో సందీప్ కిషన్ చిరంజీవి బొమ్మతో పాటు బాస్ అనే అక్షరాలను ముద్రించిన టీ- షర్ట్‌ ధరించి సందడి చేశారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ట్రైలర్ విషయానికొస్తే.. ''నేను వాడ్ని కొట్టే దెబ్బలు చాలా వైలెంట్‌గా ఉంటాయి. కళ్లు తిరిగి పడిపోతావు. లోపలికెళ్లు'' అంటూ హీరోయిన్‌తో సందీప్ కిషన్ చెబుతున్న డైలాగ్‌తో ప్రారంభమై ఆద్యంతం ఆకట్టుకుంది. గల్లీ రౌడీగా సందీప్‌ నటన సినిమాకు మేజర్ అసెట్ అవుతుందని తెలుస్తోంది.


By September 13, 2021 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sandeep-kishans-gully-rowdy-trailer-released-by-chiranjeevi/articleshow/86158099.cms

No comments