మాల్దీవుల్లో విద్యుల్లేఖ రామన్ ఎంజాయ్.. సీక్రెట్‌గా కానిచ్చేసి అతనితో చిల్ అవుతున్న లేడీ కమెడియన్
కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కారు. తాజాగా అదే బాటలో వెళ్ళింది లేడీ కమెడియన్ . ఆగస్టు 26న తన ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఆమె, పెళ్లి తంతును కూడా కానిచ్చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళ, సింధీ సంప్రదాయాల ప్రకారం అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే తన భర్తను వెంటబెట్టుకొని హనీమూన్ ట్రిప్‌కి వెళ్ళింది విద్యుల్లేఖ రామన్. సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా భావించే టూరిస్ట్ ప్లేస్ మాల్దీవులను వెళ్లి అక్కడ చిల్ అవుతోంది. మాల్దీవుల్లోని బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తూ తెగ సంబరపడుతోంది. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను సర్ప్రైజ్ చేసింది విద్యుల్లేఖ. అదేవిధంగా తన పెళ్లి ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఆమె పెళ్లి విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. పుట్టి పెరిగింది చెన్నైలో అయినా తెలుగువారి మనసు దోచుకుంది విద్యుల్లేఖ రామన్. పలు సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా నటించి కామెడీ చేయడంలో తనదంటూ ప్రత్యేకమైన దారి అని నిరూపించుకుంది. ఫీమేల్ కేటగిరీలో బెస్ట్ కమెడియన్‌గా ఆమె నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. బొద్దుగా ఉండే విద్యుల్లేఖ.. ఇటీవల తన శరీరాకృతిపై దృష్టి పెట్టి జిమ్‌లో తెగ కసరత్తులు చేసింది. క్రమంగా బరువు తగ్గి ఇప్పుడు స్లిమ్‌గా తయారైంది. బరువు తగ్గించుకునే క్రమంలోనే ఫిట్నెస్ ట్రైనర్ సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని సమాచారం. పెద్దలను ఒప్పించి ఈ జంట ఒక్కటైంది.
By September 19, 2021 at 10:03AM
No comments