సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అరవింద్..ఫ్యాన్స్‌కు ఊరట

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు యాక్సిడెంట్ బారిన పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. సాయితేజ్ షాక్‌కు గురి కావడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. కుడికన్ను, పొట్ట, ఛాతీ భాగంతో పాటు కాలికి గాయాలయ్యాయి. అయితే వెంటనే ఆయన్ని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్సలు అనంతరం అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్ తేజ్‌కు చికిత్సను అందిస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉండటంతో బ్రెయిన్, పుర్రె భాగాల్లో ఎలాంటి గాయాలు కాలేదు. సాయితేజ్‌ను పరామర్శించడానికి చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్, అల్లు అరవింద్, వరుణ్‌తేజ్, సురేఖ, నిహారిక, సాయితేజ్ తల్లి విజయ దుర్గ సహా కుటుంబ సభ్యులందరితో పాటు ఫ్యాన్స్ కూడా వచ్చారు. అసలు సాయిదరమ్ తేజ్‌కు ఏమైందోనని అభిమానుల్లో టెన్షన్ నెలకొని ఉంది. చివరకు సాయిధరమ్‌తేజ్ హెల్త్ కండిషన్‌పై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం బావుందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని అల్లు అరవింద్ తెలిపారు. తాను సాయిధరమ్‌కు చికిత్స చేసిన డాక్టర్స్‌తో మాట్లాడానని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వారు చెప్పారని, రేపటికంతా తనకు ఆరోగ్యం పరంగా ఓకే అవుతుందని, రేపు సాయిధరమ్ తేజ్ మాట్లాడే అవకాశం ఉందని చెప్పిన అల్లు అరవింద్. డాక్టర్స్ హెల్త్ బులెటిన్‌లో విడుదల చేయడం కంటే ముందు ఓ కుటుంబ సభ్యుడిగా తానీ విషయాన్ని చెబుతున్నట్లు తెలిపారు.
By September 11, 2021 at 12:25AM
No comments