కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్.. ఆ ఎమ్మెల్యే కూడా
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/86601692/photo-86601692.jpg)
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు కుమార్. హాత్మాగాంధీలోని ఏకత్వం, భగత్‌సింగ్‌లోని ధైర్యం, బీఆర్ అంబేద్కర్‌లోని సమానత్వం అన్నింటిని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందన్నారు. కాంగ్రెస్ రాజకీయ పార్టీనే కాదు.. అంతకంటే గొప్పదైన సిద్ధాంతమన్నారు. కాంగ్రెస్ లేకుండా దేశంలో పరిపాలన సరైన రీతిలో సాగదన్నారు. కన్హయ్య కుమార్ 2019 ఎన్నికల్లో సీపీఐ పార్టీ తరఫున బీహార్‌లోని బెగూసరయ్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయారు. మరోవైపు ఆర్‌డీఏఎమ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కూడా కాంగ్రెస్‌కు జైకొట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో కుదరలేదు. తాను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చేరలేదని.. తాను స్వతంత్ర ఎమ్మెల్యేను అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముతానని.. గుజరాత్‌లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. జిగ్నేష్ మేవాని ప్రస్తుతం గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.
By September 29, 2021 at 08:27AM
No comments