Breaking News

అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ, మమత.. భారత రాజకీయాల్లో ధీర వనితగా దీదీపై పొగడ్తలు


ప్రఖ్యాత ‘’ ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావశీలుర జాబితా 2021లో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం , సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అధర్‌ పూనావాలాలకు చోటు దక్కింది. ఈ జాబితాను బుధవారం విడుదల చేయగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో పాటు.. తాలిబన్‌ సహ- వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు కూడా ఉడటం విశేషం. భారత్ నుంచి ఏషియన్‌ పసిఫిక్‌ పాలసీ, ప్లానింగ్‌ కౌన్సిల్‌ కార్యనిర్వాహక డైరెక్టర్‌ పి.కులకర్ణిని కూడా ఈ జాబితాలో ప్రముఖంగా పేర్కొంది. స్వతంత్ర భారత్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మోదీలా మరెవరూ దేశ రాజకీయాలను శాసించలేదని టైమ్‌ మ్యాగజైన్‌ ప్రశంసించింది. అయితే- ‘‘దేశాన్ని లౌకికవాదం నుంచి హిందూ జాతీయవాదం వైపు ఆయన నెట్టారు.. ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాశారు. జర్నలిస్టులను నిర్బంధించి, భయపెట్టారు’’ అంటూ మోదీపై వ్యాఖ్యానం రాసిన సీఎన్‌ఎన్‌ పాత్రికేయుడు ఫరీద్‌ జకారియా ఆరోపించారు. ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని పొగడ్తలతో ముంచెత్తింది. భారత రాజకీయాల్లో ధీరవనితగా అవతరించారని టైమ్ మ్యాగజైన్‌ పేర్కొంది. వీధి పోరాట స్ఫూర్తి, పితృస్వామ్య వ్యవస్థలో తనంతట తానుగా నాయకురాలిగా ఎదగడం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని ప్రశంసించింది. ‘బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, అధికారం ఉన్న బీజేపీ, అజేయమైన ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని ఢొకొట్టి తిరిగి అధికారంలో వచ్చారు.. నరేంద్ర మోదీ విస్తరణ ఆశయానికి వ్యతిరేకంగా ఆమె ఒక కోటలా నిలిచారు’ అని ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖా దత్ రాశారు. ‘రాజకీయాల్లో ఇతర భారతీయ మహిళల మాదిరిగా కాకుండా మమతా బెనర్జీ స్వతంత్రంగా ఎదిగారు. ఒకరి భార్య, తల్లి, కుమార్తె లేదా భాగస్వామిగా ఎన్నడూ గుర్తింపు తెచ్చుకోకుండా ఆమె తీవ్ర పేదరికంలో పుట్టి పెరిగారు.. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించడానికి పాల కేంద్రం నడిపారు.. స్టెనోగ్రాఫర్‌గా పనిచేశారు.. ఆమె తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించరు, ఎందుకంటే ఆమె ఓ పార్టీ.. వీధిపోరాట స్ఫూర్తి, పితృస్వామ్య సంస్కృతిలో స్వతంత్రం జీవితం ఆమెను వేరు చేసింది. జాతీయంగా మోదీని ఎదుర్కోవడానికి వ్యతిరేక శక్తుల కూటమి కలిసి వస్తే, మమత దాదాపు కీలకం కావడం ఖాయం’ అన్నారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు, జపాన్ టెన్నిస్‌ స్టార్ నయోమి ఒసాకా, పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్‌, ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తదితరుల పేర్లు కూడా అత్యంత ప్రభావవంతుల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇక, తాలిబన్ నేత, అఫ్గన్ డిప్యూటీ పీఎం ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‘ఆకర్షణీయమైన సైనిక నాయకుడు.. అత్యంత ఆరాధనా భావం కలిగిన వ్యక్తి’ అని పేర్కొంది.


By September 16, 2021 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-mamata-banerjee-adhar-poonawala-in-time-magazine-100-most-influential-people-of-2021-list/articleshow/86251722.cms

No comments