Breaking News

టిప్ టాప్‌గా బస్టాప్‌‌‌కు వచ్చిన యువకుడు.. అతడు చేసిన పనికి షాకైన జనం.. వీడియో వైరల్


బస్టాప్‌లో అందరూ బస్ కోసం వేచి చూస్తుండగా దర్జాగా వచ్చిన ఓ యువకుడ్ని అక్కడ ఉన్న అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుకున్నారు. అయితే వారందరికీ షాకిస్తూ ‘వ్యాక్సిన్.. వ్యాక్సిన్ కోసం రండి భాయ్.. మొదటి డోస్.. సింగిల్ డోస్.. తీసుకోండి’ అంటూ అరవడం ప్రారంభించాడు. వీధుల్లో తిరిగి కూరగాయలు అమ్ముకునే వారి యాసలో ఆ యువకుడు పిలిచేసరికి తొలుత బిత్తరపోయిన జనం తర్వాత నవ్వడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. జనం తనను చూసి పగలబడి నవ్వుకుంటున్నా పట్టించుకోని యువకుడు వ్యాక్సిన్ తీసుకోండి.. రండి బాబూ రండి అంటూ పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకుంటున్నారు.. మీరు మాత్రమే మిగిలారు’ అంటూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ వీడియోను 26 వేల మంది వీక్షించగా.. వ్యాక్సిన్ వాలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో షేర్ చేసిన ఓ నెటిజన్.. ‘ఓ యజమానిలా వ్యాక్సిన్‌ను ప్రోత్సహిస్తున్నారు’ అని కామెంట్ చేశారు. కేవలం గుజరాత్ వ్యక్తులే ఇలా చేయలగరని ఓ నెటిజన్.. వ్యాక్సిన్ వాలా వచ్చాడని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకూ 84 కోట్లకుపైగా టీకా డోస్‌లను పంపిణీ చేశారు. డిసెంబరు నాటికి దేశంలోని 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలను టీకా వేసుకునేలా ప్రోత్సహిస్తోంది.


By September 24, 2021 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/gujarat-youth-calling-people-for-vaccine-at-bus-stop-funny-video-viral/articleshow/86471612.cms

No comments