Breaking News

వావ్! బండ్ల గణేష్.. ప్రచారంలో కూడా వెరైటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ని భలే వాడేశాడే!!


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు హంగామా షురూ అయింది. అక్టోబర్ 10వ 'మా' ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు, , సీవీఎల్ నరసింహా రావు తమ తమ ప్యానల్ సభ్యులతో సహా విచ్చేసి నామినేషన్స్ నమోదు చేశారు. ఇక 'మా' జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూడా తన నామినేషన్ వేసి ప్రచార రథం చేపట్టారు. అయితే ప్రచారంలో కూడా ఆయన చూపుతున్న విలక్షణత పలువురి దృష్టిని లాగేస్తోంది. తమ ప్యానల్‌కు ఓటు వేయాలని అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా కోరుతూ తన ప్యానల్ వివరాలతో కూడిన పోస్టర్ షేర్ చేశారు. ఈ మేరకు మా హితమే.. మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. మా ఆశయాలను గెలిపిద్దాం అంటూ చేతులు జోడించిన ఎమోజీలను షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన బండ్ల గణేష్ దాన్నీ రీ- ట్వీట్ చేస్తూ వెరైటీ చాటుకున్నారు. ఓన్లీ వన్ ఓట్ ఫర్ బండ్ల గణేష్ ఫర్ జనరల్ సెక్రటరీ అంటూ చేతులు జోడించిన ఎమోజీని షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌నే రీ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ఇది చూసి బండ్లన్న.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ని భలే వాడేశాడే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ లోనే ఉన్న బండ్ల గణేష్.. అందులోకి జీవిత రాజశేఖర్ చేరడంతో ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఆ ప్యానల్ నుంచి తప్పుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పోటీలో నిలిచారు.


By September 30, 2021 at 11:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-elections-bandla-ganesh-re-tweets-prakash-raj-tweet/articleshow/86636510.cms

No comments