Breaking News

భారత్‌తో చర్చలు.. ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో శిక్షణ పొందిన వ్యక్తే తాలిబన్ ప్రతినిధి!


భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ల ప్రతినిధితో భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ మంగళవారం సమావేశమయ్యారు. తాలిబన్ల వైపు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దోహా వేదికగా ఈ సమావేశం జరిగినట్టు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో నిర్ధారించింది. అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత భారత్‌ ప్రతినిధులు భేటీ కావడం ఇదే తొలిసారి. దోహాలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయం చీఫ్ షేర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్జాయ్ భారత రాయబార కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అఫ్గనిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించడం సహా భారత్‌కు రావాలని కోరుకుంటున్న మైనార్టీల తరలింపు అంశంపై ప్రధానంగా చర్చించారు. కాబుల్‌లో ఉగ్రదాడులపై ఆందోళన వ్యక్తంచేసిన భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌.. అఫ్గన్‌ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదానికి తావులేకుండా చూడాలని సూచించారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడంపై తాలిబన్‌ ప్రతినిధి హామీ ఇచ్చినట్టు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రతినిధిగా హాజరైన .. భారత సైన్యం అధీనంలోని సంస్థల్లోనే 1970-80 దశకంలో శిక్షణ పొందడం గమనార్హం. మొత్తం ఏడుగురు తాలిబన్ కీలక నేతల్లో ఈయన కూడా ఒకరు. స్టానిక్జాయ్ 1979 నుంచి 82 వరకూ నౌగావ్‌లోని ఆర్మీ క్యాడెట్ కాలేజీలో జవాన్‌గా.. తర్వాత డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో ఆఫీసర్‌గా శిక్షణ పొందారు. విదేశాల్లో పర్యటించి, ఇంగ్లీష్ భాషను మాట్లాడే అతికొద్ది మంది తాలిబన్‌ నేతలలో స్టానిక్జాయ్ ఒకరు. గతంలో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా ఉన్నారు. 1996లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలిసి.. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ దౌత్యం విఫలమయ్యింది. అంతకు ముందు ప్రభుత్వ అధికారులతో జరిగిన చర్చలలో స్టానిక్జాయ్ అబ్దుల్ హకీం హక్కానీ ఉప సంధానకర్తగానూ ఉన్నారు.


By September 01, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-talks-to-taliban-sher-mohammad-abbas-who-met-indian-envoy-trained-with-indian-army/articleshow/85822408.cms

No comments