Breaking News

19 మందిపై హత్యాచారం.. కీచక పోలీస్‌కు ఉరే సరి.. హైకోర్టు సంచలన తీర్పు


ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత కిరాతకంగా హత్యచేసిన నరహంతకుడు ఉమేశ్‌రెడ్డి (48)కి బుధవారం ఉరి శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ఆరు వారాల సమయమిచ్చింది. చిత్రదుర్గకు చెందిన బీజే ఉమేశ్ అలియాస్ ఉమేశ్‌రెడ్డి కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 19 మందిపై అత్యాచారానికి పాల్పడి.. పలువుర్ని హతమార్చినట్లు కోర్టు విచారణలో తేలింది. బెంగళూరు పరిధిలోని పీణ్యలో 1998లో ఓ మహిళపై హత్యాచారానికి పాల్పడిన కేసులో సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో ఉరి శిక్ష విధించగా.. దీనిని 2011లో కర్ణాటక హైకోర్టు సమర్ధించింది. అయితే, తన కుమారుడికి ఉరిశిక్ష రద్దుచేసి, యావజ్జీవిత ఖైదు విధించాలంటూ అతడి తల్లి గౌరమ్మ 2013లో రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం అర్జీ పెట్టుకున్నారు. అయితే, దీనిని రాష్ట్రపతి తిరస్కరించగా.. సర్వోన్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురయ్యింది. అయితే, ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని 2016లో అప్పీలు చేశాడు. ఈ విషయంలో హైకోర్టునే సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది. సెషన్స్‌ కోర్టు తీర్పును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అరవింద కుమార్‌, జస్టిస్‌ ప్రదీప్‌ సింగ్‌ యెరూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు 2016 అక్టోబరు 17న ఉరి శిక్షను ఖరారు చేసింది. 19 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, పలువుర్ని హత్యచేసినట్టు ఉమేశ్ రెడ్డి‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉమేశ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పరారైన ఆయన్ను పోలీసులు వలపన్ని 2002లో యశ్వంతపురలో పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి ఆధారాలు సేకరించారు. అతనిపై 11 కేసుల్లో విచారణ పూర్తయి శిక్షలు పడగా.. మరో 8 కేసుల్లో తీర్పులు వెలువడాల్సి ఉంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన ఉమేశ్.. సైకో కిల్లర్‌ అని పోలీసులు నిర్ధారించారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, తర్వాత హత్యచేసి వారి మృతదేహాలపై కూడా లైంగిక దాడి చేసేవాడు. మొత్తం 19 అత్యాచారం కేసుల్లో పదకొండింటిలో అతడి దోషిగా నిర్దారణ అయ్యింది.


By September 30, 2021 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-high-court-dismissed-serial-rapist-murderer-umesh-reddys-mercy-plea/articleshow/86633611.cms

No comments