Breaking News

Vedalam Remake: మెగా అప్డేట్ వచ్చేసింది.. చిరు అభిమానులకు సూపర్ కిక్కిచ్చిన మహేష్ బాబు


మెగాస్టార్ బర్త్ డే (ఆగస్ట్ 22) సందర్బంగా అప్డేట్లతో సోషల్ మీడియా మోత మోగే ఆ క్షణం రానే వచ్చింది. వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న చిరంజీవి సినిమాల నుంచి ఎలాంటి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ వస్తాయని ఎదురుచూస్తున్న మెగా లోకానికి తాజాగా స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ మెహర్ రమేష్. రేపు ఉదయం తొమ్మిది గంటలకు మెగా ప్రభంజనం చూస్తారని ముందే ప్రకటించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కిక్కిచ్చే అప్‌డేట్ వదిలారు. చిరంజీవి హీరోగా '' సినిమా ప్రకటించి ఏడాదికి పైనే అవుతుంది. ఈ మూవీ కోసమే అన్నట్టుగా ఆ మధ్య చిరంజీవి కొత్త లుక్కును ట్రై చేశారు. అర్బన్ మాంక్ అన్నట్టుగా గుండు బాస్‌గా మారిపోయారు. ఆ లుక్కును చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వేదాళం సినిమాలో అజిత్ పోషించిన పవర్ ఫుల్ పాత్రను చిరు చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ మూవీకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూను ఇప్పటికే మెహర్ రమేష్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిరు పుట్టినరోజున అదిరిపోయే కానుక ఇచ్చారు మెహర్ రమేష్. ''గా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ఈ టైటిల్, టైటిల్ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌కి ఊహించని కిక్కిచ్చింది. 'భోళా శంకర్' టైటిల్ అదుర్స్, మెగా ట్రీట్ అంటే ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు మోహన్‌రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో చిరు నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. దీంతో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమాను లైన్‌లో పెట్టారు.


By August 22, 2021 at 09:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bholaa-shankar-mahesh-babu-reveals-chiranjeevi-mehar-ramesh-movie-title/articleshow/85529419.cms

No comments