Breaking News

తాలిబన్లకు షాక్.. మూడు జిల్లాలను స్వాధీనం చేస్తున్న మిలీషియా సైనిక దళం!


ఉత్తర అఫ్గనిస్థాన్‌లోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. పంజిషిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను అఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ట్విట్టర్‌లో తెలిపారు. పంజిషీర్‌కు ఉత్తరాన బఘలాన్ ప్రావిన్సుల్లోని దేహ్ సలేహ్, బనో, పల్-హేసర్ జిల్లాలలో తాలిబన్‌లను సంయుక్తంగా ప్రతిఘటించి అక్కడ నుంచి వెళ్లగొట్టాయని రక్షణ మంత్రి ట్వీట్ చేశారు. అయితే, ఇందులో ఎవరి ప్రమేయం ఉందో వెంటనే స్పష్టంగా తెలియలేదు.. కానీ ఈ సంఘటనతో ఆఫ్గనిస్థాన్‌లోని ప్రధాన నగరాలన్నింటినీ మెరుపు వేగంతో స్వాధీనం చేసుకుని అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లకు వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యిందనే సంకేతం పంపారు. అఫ్గన్ మీడియా టోలో న్యూస్‌తో స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. బఘ్లాన్‌లోని బనో జిల్లా మిలీషియా దళాల స్వాధీనంలో ఉంది.. చాలా పెద్ద సంఖ్యలో అక్కడ చనిపోయారు అన్నారు. ఈ ఘటనపై తాలిబన్లు ఎటువంటి ప్రకటన చేయలేదు. దేశంలో తాలిబన్లను తిప్పికొట్టి, పంజ్‌షీర్ లోయలో ప్రతిఘటిస్తామని మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్, సోవియట్ వ్యతిరేక ముజాహిద్దీన్ మాజీ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు ప్రతిజ్ఞ చేశారు. మసూద్ సన్నిహితుల ప్రకారం 6 వేల మందికిపైగా ఫైటర్లు ఆయన వెంట ఉన్నారు. సైన్యం, ప్రత్యేక దళాలతో స్థానిక మిలీషియా గ్రూపులు పంజ్‌షీర్ లోయలో కాపుకాస్తున్నాయి. వారి దగ్గర హెలికాప్టర్లు, సైనిక వాహనాలను ఉన్నాయని, సోవియట్ విడిచిపెట్టిన కొన్ని సాయుధ వాహనాలను మరమ్మతులు చేశారని చెప్పారు. అఫ్గన్‌లోని తూర్పు నగరాలు, రాజధాని కాబూల్‌లో జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఆందోళన చేస్తున్న నిరసనకారులు.. పంజ్‌షీర్‌లోని సమూహాల మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ తాలిబాన్లు తమ విజయాన్ని ఏకీకృతం చేయడం ప్రారంభించినప్పుడు సమస్యల తప్పవని చెప్పకనే చెబుతున్నారు. ఇక, తాలిబన్లు ఇప్పటి వరకూ పంజ్‌షీర్‌లో కాలుపెట్టలేకపోయారు. గత 30 ఏళ్లుగా ఆ లోయలోకి అడుగుపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కానీ, బయట మద్దతు లేకపోవడం, ఆయుధాలను మరమ్మతు చేయడం, నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున అక్కడి సమూహాలు సమర్థవంతమైన ప్రతిఘటన సామర్థ్యం గురించి పాశ్చాత్య దౌత్యవేత్తలు, ఇతరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అఫ్గనిస్థాన్‌ను 1979 నుంచి 89 వరకు సోవియట్ యూనియన్ ఆక్రమించుకోగా.. ముజాహిద్దీన్‌లు పోరాటంతో వెనుదిరిగింది.


By August 22, 2021 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/we-have-taken-three-districts-in-north-afghanistan-says-anti-taliban-forces/articleshow/85529570.cms

No comments