Breaking News

RRR: ఎన్టీఆర్ తలకు గాయం.. నందమూరి అభిమానుల్లో ఆందోళన! అసలేం జరిగింది..?


దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ఏదేమైనా అక్టోబర్‌ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్సయ్యారు జక్కన్న. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో చూసి నందమూరి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం తలపై గాయం కనిపిస్తుండటం. షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ సమయంలో తన హీరోలతో సరదాగా గడిపారు జక్కన్న. రామ్ చరణ్‌, తారక్‌ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు కనిపించారు. ఈ వీడియోను RRR టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ తలకు చిన్న గాయం గమనించిన నందమూరి ఫ్యాన్స్.. 'మా హీరోకి ఏమైంది?' అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది నిజమైన గాయమేనా? లేక షూటింగ్‌లో భాగంగా సీన్ కోసం చేసిందా? అనేది తెలియరాలేదు. అయితే అది మేకప్ దీనికి కూడా ఇంత హడావిడి అవసరమా? అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాను సుమారు 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందిస్తున్నారు. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కీరవాణి బాణీలు కడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది. ఇక ఈ మూవీపై మెగా, నందమూరి అభిమానుల్లో ఉన్న అంచనాలు మాటల్లో చెప్పలేం.


By August 08, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-viral-video-fans-seen-small-injury-on-jr-ntr-head/articleshow/85145589.cms

No comments