కూతురితో సురేఖావాణి రచ్చ.. సుప్రిత అందాలకు నెటిజన్స్ ఫిదా! వయసుపై షాకింగ్ రియాక్షన్
సురేఖావాణి, ఆమె కూతురు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హంగామా చేస్తుంటారో తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెలబ్రిటీ హోదాలో చిందులాటకు, సెలబ్రిటీ కిడ్‌గా సుప్రిత అందాలు యాడ్ అవుతూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుంటాయి. ఎవ్వరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఏ విధంగా రియాక్ట్ అయినా తమ లైఫ్ స్టైల్ తమదే అన్నట్లుగా ఆ ఇద్దరూ నెట్టింట హవా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూతురితో కలిసి సురేఖావాణి చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. భర్త సురేష్ తేజ చనిపోయిన తరువాత ఆ బాధను దిగమింగుతూనే కూతురుతో సరదాగా గడుపుతోంది సురేఖావాణి. వీలు కుదిరినప్పుడల్లా కూతురు సుప్రితతో కలిసి హాలిడే ట్రిప్స్, పబ్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే నేడు (ఆగస్టు 8) సుప్రిత పుట్టిన రోజు సందర్భంగా తల్లీకూతుళ్లిద్దరూ కలిసి జాలీగా గడిపారు. ఎప్పటిలాగే డాన్సులేస్తూ తమదైన స్టెప్పులతో రెచ్చిపోయారు. తల్లి సురేఖతో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన ఆ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది సుప్రిత. ఇందులో ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా యమ హుషారుగా చిందేశారు. మోడ్రన్ దుస్తుల్లో అట్రాక్ట్ చేశారు. ఈ వీడియోలో సుప్రిత అందాలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. వావ్! సూపర్ అంటూ కొందరు రియాక్ట్ అవుతుంటే.. కొందరు మాత్రం కాస్త అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇకపోతే తన పుట్టినరోజు సందర్భంగా సుప్రిత చేసిన కామెంట్ ట్రెండ్ అవుతోంది. 'వయసు పెరుగుతుంది అంటే నేను వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నట్లు కాదు.. ఇంకా పర్ఫెక్ట్ అవుతున్నట్లు' అంటూ లాజిక్ ప్లే చేసింది సురేఖావాణి డాటర్. ఇది చూసి కరెక్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంత హాట్‌గా ఉన్న నీ సినీ ఎంట్రీ ఇంకెప్పుడు? అని కూడా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
By August 08, 2021 at 09:52AM
No comments