Breaking News

RRR దోస్తీ వచ్చేసింది: కీరవాణి మ్యాజిక్.. రాజమౌళి విజువల్ ట్రీట్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అలా!


దర్శకధీరుడు స్ట్రాటజీని అర్థం చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు. ఆయన ఏది చేసినా కూడా పక్కా ప్రణాళికతో చేస్తుంటారు. జనాల్లోకి ఇట్టే రీచ్ అయ్యే విధంగా అప్‌డేట్స్ ఇస్తుంటారు. తాజాగా అలాంటి స్కెచ్చే వేసి స్నేహితుల దినోత్సవం కానుకగా 'RRR దోస్తీ' సాంగ్ రిలీజ్ చేశారు. నుంచి విడుదలైన ఈ ఫస్ట్ సాంగ్‌ క్షణాల్లో వైరల్ అయింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. అంటూ సాగే ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం 5 భాషల నుంచి ఐదుగురు సింగర్లను రంగంలోకి దించారు జక్కన్న. ఆగస్ట్ ఒకటో తారీఖున ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించి మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు. తాజాగా చెప్పిన సమయానికి ఈ సాంగ్ విడుదల చేసి అందరిలో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. , అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ పాడిన ఈ పాటలో కీరవాణి అందించిన బాణీలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. సాంగ్ చివరలో మెగా స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నడుస్తూ వస్తున్నట్లు కనిపించిన సీన్.. సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. కీరవాణి భుజంపై చేయి వేసిన ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా స్టిల్స్ ఇచ్చారు. ప్రతి భాషలోని సినీ ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ షూట్ చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ సాంగ్ గురించి స్పందించిన హేమచంద్ర.. ''సాంగ్ షూట్ అయితే వేరే లెవెల్. ప్రతీ పాట పాడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో పాడటం ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అంతే కాకుండా ప్రమోషన్ సాంగ్‌లో ఉండటం, అది వచ్చిన తీరు మైండ్ బ్లోయింగ్. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ లైన్ సూపర్‌గా ఉంది. ఓవరాల్ ప్యాకేజ్ ఇది'' అని తెలిపిన సాంగ్‌పై క్యూరియాసిటీ పెంచారు. పాన్‌ ఇండియా మూవీగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


By August 01, 2021 at 11:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-dosti-song-released-rajamouli-visual-treat/articleshow/84940462.cms

No comments