రజనీకాంత్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. వచ్చే నెలలో పూర్తి.. ఆ టైమ్‌కి రిలీజ్ పక్కా..
దక్షిణాది ఇండస్ట్రీల్లోనే కాదు.. ఆయన సినిమా విడుదల అవుతుందంటే.. యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటారు. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు కొన్ని కార్యాలయాలు సెలవులు కూడా ప్రకటిస్తాయి. ఆయన క్రేజ్ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోయింది. ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్. స్టైల్‌కి, హీరోయిజంకి కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే అది అనే ఆయన అభిమానులు చెబుతారు. అయితే రజనీ వెండితెరపై కనిపించి చాలాకాలమైంది. చివరిగా ‘దర్బార్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘’. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. విశ్వాసం, వివేకం తదితర సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివకుమార్ జయకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అయినప్పటికీ.. ఈ మధ్యలో కరోనా రావడం.. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల రజనీ షూటింగ్‌లో పాల్గొనలేకపోవడం తదితర అంశాలు సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు అన్ని సజావుగా జరుగుతుండటంతో.. సినిమా షూటింగ్‌ని శేరవేగంగా జరుపుతోంది చిత్ర యూనిట్. వచ్చే నెలాఖరు వరకూ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఓ ఊరి పెద్ద పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్లుగా మీనా, కుష్బూ, నయనతార నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుంది. జాకీ షాఫ్ర్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వేల రామ్మూర్తి తదితరులు ప్రధాన తారగణంగా ఉండనున్నారు. డి.ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
By August 01, 2021 at 11:46AM
No comments