Navarasa : Project Agni కథ ఇదే.. నేషనల్ వైడ్ ట్రెండింగ్
అనే వెబ్ సిరీస్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాది నుంచి వచ్చిన అతి పెద్ద వెబ్ సిరీస్ ఇదే. ఇందు కోసం తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది మంది విలక్షణ నటులు కలిసి వచ్చారు. పాండమిక్ సమయంలోనే ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఇలా అందరూ కలిసి ఒకే ప్రాజెక్ట్ కోసం పని చేశారు. శోకం, హాస్యం, అద్బుతం, శృంగారం అంటూ ఇలా నవరసాలకు సంబంధించిన కథలను చూపించారు. వీటిని మణిరత్నం నిర్మించారు. అయితే ఇందులో అన్ని రకాల రసాలున్నా కూడా అందరినీ ఒకే ఒక విషయం ఆకట్టుకుంది. అద్బుతం అనే కాన్సెప్ట్‌లో నిజంగానే అద్భుతాన్ని చూపించారు. అపార మేధస్సు ఉన్న శాస్త్రవేత్తగా కనిపిస్తాడు. నాసా, ఇస్రో వంటి సంస్థలు కూడా ఆయన కోసం ఎదురుచూస్తుంటాయి. కానీ ఎవరి కిందా పని చేయకుండా తాను స్వేచ్చంగా ఆలోచించాలనే కారణంతో సొంతంగా తన ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఆయన చేసిన ఓ ప్రయోగం వల్ల జీవితమే మారిపోతుంది. టైం మిషన్ లాంటి డ్రిఫ్ట్ మిషన్ అనే దాన్ని కనిపెడుతాడు. దాన్ని తనపై ప్రయోగించుకోవడంతో తన గతం, భవిష్యత్తు అంతా మారిపోతుంది. తన భార్య, పిల్లలు కూడా తన జీవితంలో ఉండకుండా మాయమైపోతారు. అయితే ఇది చాలా పెద్ద తప్పు.. ఈ ప్రయోగం వల్ల చెడు ఎంతో జరుగుతుందని భావిస్తాడు. కానీ అంతలోపే తన అసిస్టెంట్ కూడా ఈ ప్రయోగం వల్ల అతీత శక్తులను సంపాదిస్తాడు. దాన్ని చెడు కోసం ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ అసిస్టెంట్ ఆ ప్రయోగానికి సంబంధించిన బ్లూ ప్రింట్ తీసుకెళ్తాడు. ఈ ప్రయోగం గురించి, ఆ అసిస్టెంట్ గురించి ప్రపంచానికి చెప్పి తాను చనిపోవాలని అరవింద్ స్వామి అనుకుంటాడు. ఇదంతా చెప్పేందుకు తన సైంటిస్ట్ ఫ్రెండ్ అయిన ప్రసన్నను రమ్మంటాడు. అంతా వివరిస్తాడు. చివరకు ఆ ఫార్మూలా కూడా అతని చేతిలో పెట్టి.. ఆ అసిస్టెంట్‌ను పట్టుకోమ్మని చెబుతాడు. చివరగా తాను చనిపోవాలని అనుకుంటున్న సమయంలోనే అసలు ట్విస్ట్ వస్తుంది. అసలు వచ్చింది తన ఫ్రెండ్ కాదని, తన ఫ్రెండ్ రూపంలో అసిస్టెంట్ వచ్చాడు.. తన ఫార్మూలాను పట్టుకెళ్లాడని తెలియడంతో పూర్తవుతుంది. ఈ కథకే అందరూ ఫిదా అయినట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా కూడా ఇదే కథ గురించి చర్చ జరుగుతోంది.
By August 07, 2021 at 08:24AM
No comments