Lakshmi Manchu : కుక్కలా గమనిస్తూ ఉంటాను.. రకుల్ కొంటె చేష్టలపై మంచు లక్ష్మీ కామెంట్స్
మంచు లక్ష్మీ, ఒక్కచోట కలిశారంటే అక్కడంతా సందడి వాతావరణం నెలకొనాల్సిందే. ఈ ఇద్దరూ వెకేషన్స్ అంటూ ఎక్కువగా విదేశాలు తిరుగుతూ సందడి చేస్తుంటారు. ఇక స్పెషల్ షోల్లో కలిసి ఈ ఇద్దరూ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆ మధ్య ఆహాలో రానా హోస్ట్‌గా వచ్చిన నెంబర్ వన్ యారీ షోలోనూ దుమ్ములేపేశారు. పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఒకరి గురించి మరొకరు కామెంట్లు చేసుకున్నారు. ఇక రానా, , రకుల్ ఈ ముగ్గురు కూడా మంచి స్నేహితులేనన్న సంగతి తెలిసిందే. అలా మంచు లక్ష్మీ ఏ షో చేసినా కూడా రకుల్ అందులో రావాల్సిందే. కనిపించాల్సిందే. ఆ మధ్య వూట్ యాప్ కోసం మంచు లక్ష్మీ చేసిన స్పెషల్ షోలోనూ కనిపించారు. ఇక ఇప్పుడు ఆహా భోజనంబు కోసం కూడా రకుల్ వచ్చారు. ఇందులో రకుల్ మంచు లక్ష్మీ చేసిన అల్లరి అందరినీ ఆకట్టుకుంటోంది. తనకు తినడం మాత్రమే వచ్చు వండటం అంతగా రాదని రకుల్ చెప్పారు. అయితే ఎలా వండాలి.. ఏయే పదార్థాలు ఎంతలో వేయాలి అనేవి మాత్రం తెలుసని అన్నారు. అయితే రకుల్ తిండి గురించి మంచు లక్ష్మీ అసలు విషయం చెప్పారు. రకుల్ తన జీవితంలోకి వచ్చిన తరువాత ఎన్నో అలవాట్లు మారిపోయానని, మరీ ముఖ్యంగా తిండి విషయంలో ఎంతో మార్పు వచ్చిందని మంచు లక్ష్మీ అన్నారు. రకుల్‌తో ఎక్కడికైనా వెళ్లినప్పుడు తాను జాగ్రత్తగా ఉంటానని అన్నారు. రకుల్‌తో రెస్టారెంట్‌కు వెళ్తే.. చాలా జాగ్రత్తగా ఉంటాను..ఆర్డర్ చేసిన వాటిలో అన్నింటిని పైపైన తినేసి చెత్తంతా కూడా మాకు వదిలేస్తుంది.. అలా ఓ సారి విదేశాలకు వెళ్లినప్పుడు.. మ్యాంగ్ ఫ్లేవర్ కేక్‌లో పైన ఉన్న మ్యాంగో ఫ్లేవర్ అంతా తినేసింది. చెర్రీ కేక్‌లో చెర్రీని తినేస్తుంది. అలా రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్‌లో రకుల్ ఏమేం ఏరుకుంటోంది..ఏం చేస్తుందని ఎప్పుడూ కుక్కలా గమనిస్తూనే ఉంటాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
By August 01, 2021 at 02:34PM
No comments