Breaking News

HBD Maheshbabu: ‘ఎప్పుడు ఛార్మ్‌కి కేరాఫ్ అడ్రెస్’.. సూపర్‌స్టార్‌కి విషెస్ చెప్పిన మెగాస్టార్


తెలుగు హీరోల్లో గ్లామర్‌కి కేరాఫ్ అడ్రెస్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఒకే ఒక పేరు మహేష్‌బాబు. ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆ థియేటర్ వద్ద పండగ వాతావరణం ఉంటుంది. భారీ కటౌట్లు పెట్టి, పాలాభిషేకం చేస్తూ.. టపాసులు కాలుస్తూ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తుంటారు. ఇక ఆయన పుట్టినరోజు వచ్చిందంటే. వాళ్లు చేసే సందడి మామూలుగా ఉండదు. అయితే అసలు విషయానికొస్తే.. మహేష్‌బాబు సోమవారం తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, తోటి సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ కూడా మహేష్‌బాబుకి విషెస్ తెలిపారు. ‘ఎవర్‌గ్రీన్ ఛార్మింగ్‌ సూపర్‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు. స్టైల్‌కి, సబ్స్‌టాన్స్‌ రెండింటి కలయిక ఆయన. ఈ ఏడాది ఆయనకు బ్లాక్‌బస్టర్‌గా ఉండాలి’ అంటూ చిరూ ట్వీట్ చేశారు. ఇక మహేష్‌పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి టీజర్‌ని విడుదల చేశారు. స్టైలిష్‌లుక్‌లో టీజర్‌లో మహేష్‌బాబు అదిరిపోయారు. ఆరంభంలో ఫైట్.. ఆ తర్వాత రొమాన్స్ ఈ రెండింటిని సమానంగా టీజర్‌లో చూపించారు. ‘గీత గోవిందం’ ఫేమ్ దర్శకుడు పరుశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మహానటి’ కీర్తీ సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


By August 09, 2021 at 11:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-wishes-superstar-mahesh-babu-on-his-birthday/articleshow/85171004.cms

No comments