Chiru 153: గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. రావడం రావడమే అటాక్.. చితక్కొట్టేశారట!!
మెగాస్టార్ హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించారు. చిరంజీవి 153వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా రూపొందిస్తున్నారు. శుక్రవారం రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఫైట్ సీన్‌తో మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో పోరాట సన్నివేశంతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. స్టంట్ మాస్టర్ సిల్వ నేతృత్వంలో ఈ సన్నివేశం చిత్రీకరణ జరిపారు. రావడం రావడమే విలన్లను చిరంజీవి చితక్కొట్టేశారట. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నయనతారను తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే 'లూసీఫర్'. దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి రూపొందిస్తున్నారు మోహన్ రాజా. మెగా అభిమానులు ఫిదా అయ్యేలా అదిరిపోయే సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక పేర్లు పరిశీలించి చివరకు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఫిక్సయ్యారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. విద్యాబాలన్ మెగాస్టార్‌కి సిస్టర్‌గా నటించబోతుందని తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు సినిమాలపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
By August 14, 2021 at 09:40AM
No comments