Breaking News

దానిపై పక్కా క్లారిటీ ఇచ్చేసిన అడివిశేష్.. కశ్మీర్ నుంచి కన్యకుమారి వరకూ అంటూ ట్వీట్


26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మేజర్’. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. సైయూ మంజ్రేకర్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌లు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాలో శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం కూడా చూపించనున్నారు. అయితే ఈ సినిమా నిజానికి జూలై 2న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో విడుదలను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలపై మొదటి నుంచి చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూనే ఉంది. తమ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి హీరో అడివి శేష్ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ‘మేజర్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం అయిందంటూ ట్వీట్ చేశారు అడివిశేష్. ‘ఈ సినిమా మీ అందరి ముందుకు తీసుకువచ్చేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉండే ప్రేక్షకుల కోసం సినిమా విడుదల థియేటర్లలోనే. అది పరిస్థితులు బాగుంటేనే. మన 75వ స్వతంత్ర దినోత్సవం కూడా దగ్గర్లోనే ఉంది’ అంటూ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఇక తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు.


By August 12, 2021 at 11:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/major-cinema-starts-its-final-schedule-tweets-hero-adivi-sesh/articleshow/85264265.cms

No comments