ఇంట్లోనే కానిచ్చేస్తున్న విజయ్ దేవరకొండ.. బాయ్ ఈజ్ బ్యాక్ అంటూ రౌడీ స్టార్ ఎంటర్
కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ అతలాకుతలమైంది. మేకర్స్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్స్‌లో సందడి చేయాల్సిన ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలిస్తుండటంతో వాయిదాపడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'బాయ్ ఈజ్ బ్యాక్' అంటూ రౌడీ స్టార్ ఎంటర్ అయ్యాడు. తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేస్తూ '' అప్‌డేట్ ఇచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' మూవీ తెరకెక్కుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ముంబై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం విజయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు తెలిపాడు. 'యువర్ బాయ్ ఈజ్ బ్యాక్.. వర్క్ ఫ్రమ్ హోమ్' అంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫొటో చూస్తుంటే లైగర్ మూవీ కోసం విజయ్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్లు అర్థమవుతోంది. ఆయన ముందు మైక్ ఉండగా.. ఓ చేతిలో ఓ కాఫీ కప్, మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని యమ స్టైలిష్‌గా కనిపించారు విజయ్ దేవరకొండ. కరోనా కారణంగా వాయిదాపడిన 'లైగర్' సినిమా పనులు మళ్లీ లైగర్ మొదలుకావడంతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. 'లైగర్' టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు.
By August 12, 2021 at 11:15AM
No comments