Breaking News

భారత్‌లో స్థానికత దశలోకి కోవిడ్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సంచలన వ్యాఖ్యలు


భారత్‌లో వ్యాప్తి తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ () చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. స్వల్ప లేదా ఓ మోస్తరు స్థాయిలో వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పుడు ఒక రకమైన స్థానికత దశలోకి ప్రవేశించి ఉండవచ్చని ఆమె అన్నారు. అంటే వైరస్‌తో కలిసి ప్రజలు జీవించడం నేర్చుకునే దశ... మహమ్మారి ఉద్ధృతంగా వ్యాప్తిచెందిన దశకు చాలా భిన్నంగా ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. ది వైర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశ పరిమాణం, వివిధ ప్రాంతాలలో జనాభా వైవిధ్యత, రోగనిరోధక శక్తి స్థితిని బట్టి, దేశంలోని వివిధ ప్రాంతాలలో వైరస్ హెచ్చు తగ్గుల పరిస్థితి సాధ్యమైనంత వరకూ ఇలాగే కొనసాగవచ్చు.. స్వల్ప లేదా మధ్యస్త స్థాయిలో వైరస్ వ్యాప్తి కొనసాగి ఒకరకమైన స్థానికత దశలోకి ప్రవేశిస్తున్నాం.. అయితే, కొన్ని నెలల కిందట చూసిన భారీ పెరుగుదల, తీవ్రత ఉండకపోవచ్చు’ అని శ్రీ స్వామినాథన్ చెప్పారు. కానీ, ప్రత్యేకించి మొదటి, రెండో దశలో తక్కువ ప్రభావం చూపిన ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలు, వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న ప్రాంతాలలో రాబోయే నెలల్లో వ్యాప్తి గరిష్టంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 2022 చివరి నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయి.. ఆ తర్వాత ప్రపంచం సాధారణ స్థితికి చేరుకోగలదని ఆశిస్తున్నాను అని ఆమె అన్నారు. పిల్లలకు మూడో దశలో ముప్పు ఎక్కువగా ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇతర దేశాలు, సెరో సర్వే ఆధారంగా పిల్లలకు వైరస్ సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ వారిపై వైరస్ అంతగా ప్రభావం చూపడం లేదు. స్వల్ప అనారోగ్యానికి గురవుతున్నారు. కొద్దిమంది చనిపోయినా కానీ పెద్దల కంటే ఇది చాలా తక్కువ అన్నారు. అయితే, పిల్లలకు ప్రత్యేక పీడియాట్రిక్ వార్డులు, ఆసుపత్రులను సిద్ధం చేయడం మంచిదేనని తెలిపారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే పిల్లలకు ఆరోగ్య వ్యవస్థ అనేక విధాలుగా ఉపయోగపడుతుందన్నారు.


By August 25, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-may-be-entering-endemic-stage-of-coronavirus-says-who-chief-scientist/articleshow/85613645.cms

No comments