Breaking News

పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా బెన్నెట్ యూనివర్సిటీ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రశంసలు


టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన మూడో స్నాతకోత్సవం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బయోకాన్ ఎండీ డాక్టర్ కిరణ్ మంజుదార్ షా, నెస్టలే ఇండియా ఛైర్మన్, ఎండీ సురేశ్ నారాయణ సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్‌యానీ ఘోష్ ప్రత్యేక అతిథిగా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. బెన్నెట్ యూనివర్సిటీ ఛాన్సెలర్ వినీత్ జైన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో బెన్నెట్ యూనివర్సిటీ అంకితభావం ప్రశంసనీయమని.. నాణ్యమైన విద్యకు కేంద్రంగా స్థిరపడిందని కొనియాడారు. ప్రస్తుత కాలంలో విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు అగ్రగామిగా ఎదిగి, ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు మార్గదర్శకులుగా మారుతున్నాయని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతికి బెన్నెట్ యూనివర్సిటీ మూల కేంద్రంగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 98 మంది పీహెచ్‌డీ విద్యార్థులలో 55 మందికి యూని నిధులు సమకూరుస్తోంది. బెన్నెట్ యూనివర్సిటీలో అత్యుతన్న ప్రమాణాలు కలిగిన ప్రొఫెసర్లు, విద్యార్థులు ఉన్నారని కేంద్ర మంత్రి అన్నారు. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించిన జర్నల్స్‌కు 18 పేటెంట్లను దాఖలు చేసినట్లు విద్యా మంత్రి తెలిపారు. విశ్వవిద్యాలయం నిబద్ధతతో ఈ సంఖ్య ఖచ్చితంగా మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో 412 మంది డిగ్రీలు పుచ్చుకున్నారని, అది వారి కృషి ఫలితమని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం 2020కి ఏడాది పూర్తయిన సందర్భంగా.. NEP 2020లో ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్’, ‘మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్’, ‘నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరమ్‌’తో సహా పలు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు విద్యా మంత్రి తెలిపారు. NEP 2020పై అవగాహన కోసం బెన్నెట్ యూనివర్సిటీ అనేక ప్రత్యక్ష వెబ్‌నార్లు, సెమినార్‌లను నిర్వహించినందుకు మేం సంతోషిస్తున్నామని అన్నారు.


By August 09, 2021 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-education-minister-dharmendra-pradhan-appreciated-to-bennett-university-in-the-convocation/articleshow/85168641.cms

No comments