'మై లవ్' అంటూ రానా భార్య మిహికా ఎమోషనల్ పోస్ట్.. వెంటనే రియాక్ట్ అయిన సమంత!! ఇదీ మ్యాటర్..
దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో మిహికా బజాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. భర్తతో కలిసి దిగిన ఓ అద్భుతమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన మిహికా.. రానాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తాము వివాహ బంధంలోకి ఎంటరై ఏడాది గడిచిన సందర్భంగా ఈ పోస్ట్ పెట్టారు. ఆమె చేసిన ఈ పోస్ట్ చూడగానే స్టార్ హీరోయిన్స్ సమంత, శృతి హాసన్‌లు రియాక్ట్ అయ్యారు. రానాతో ఏడడుగులు నడిచి ఏడాది పూర్తయిన సందర్భంగా భర్తపై ప్రేమను కురిపిస్తూ తన బంధం ఎంతో అద్భుతం అని పేర్కొన్నారు మిహికా. ''నా లవ్‌కి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఎంతో ఆనందంగా గడిచింది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మంచి మనసున్న మనిషిగా నా జీవితంలో నాకు తోడుగా ఉంటున్నావు. థ్యాంక్యూ మై లైఫ్.. మై లవ్'' అంటూ మిహికా తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు. ఈ మేరకు రానాతో దిగిన ఓ అద్భుతమైన పిక్ షేర్ చేశారు. ఇందులో కెమెరా వైపుగా చూస్తుంటే.. మిహికా మాత్రం రానా కళ్ళలోకి చూస్తూ ఆయన ప్రేమలో మునిగినట్లు కనిపిస్తున్నారు. ఇద్దరూ మోడ్రన్ లుక్‌లో తెగ అట్రాక్ట్ చేస్తుండటంతో ఈ పిక్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఇక మిహికా చేసిన ఈ పోస్ట్ చూడగానే అక్కినేని కోడలు సమంత రియాక్ట్ అవుతూ 'మీ ఇద్దరిపై ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి' అని కోరుకుంది. శృతి హాసన్ స్పందిస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లవ్లీస్ అని కామెంట్ చేసింది. పెళ్లి తర్వాత మిహికతో ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తూనే సినిమాల జోష్ పెంచారు దగ్గుబాటి రానా. ప్రస్తుతం ఆయన ''విరాటపర్వం, హాతి మేరే సాతి'' సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లో నటిస్తున్నారు.
By August 09, 2021 at 08:35AM
No comments