Breaking News

శ్రీదేవి ప్రైవేట్‌గా కలిసింది.. ఆ టైమ్‌లో ప్రపోజ్ చేస్తే వేరేలా ఉండేది.. సీక్రెట్ చెప్పిన ఆర్జీవీ


రామ్ గోపాల్ వర్మ.. ఒకానొక సమయంలో సినిమా తీరుతన్నెలు మార్చేస్తూ ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించిన గ్రేట్ డైరెక్టర్. అప్పట్లో ఆయన సినిమా వస్తుందంటే అందరిలో ఓ రకమైన ఆత్రుత కనిపించేది. అంతలా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్న .. ఈ మధ్యకాలంలో ట్రాక్ చేంజ్ చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూనే తన మనసులోని మాటలను, గత విషయాలను బయటపెడుతూ సంచలనం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దివంగత నటి టాపిక్ తీస్తూ సీక్రెట్స్ రివీల్ చేశారు వర్మ. రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తాను అతిలోక సుందరి శ్రీదేవికి వీరాభిమానిని అని ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు వర్మ. శ్రీదేవి అందానికి భక్తుడిని అని కూడా చాలా సందర్భాల్లో ఓపెన్ అయిన వర్మ.. ఓ ఇంటర్వ్యూలో ఆమెను భార్యగా పొందే అవకాశం తనకు వచ్చిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు 'గోవిందా గోవిందా' షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ''గోవిందా గోవిందా షూటింగ్ చేస్తున్నప్పటికే శ్రీదేవి టాప్ హీరోయిన్. ఆ సమయంలో ఆమెను టాక్స్ సమస్యలు వెంటాడుతుండేవి. అలాగే కుటుంబ పరమైన ఇష్యూస్, సోదరితో వివాదం ఇలా చాలా సమస్యలతో సతమతమవుతున్న ఆమె.. ఓ రోజు నన్ను ప్రైవేట్‌గా కలిసి మాట్లాడింది. అంతకు రెండు నెలల ముందే నా భార్యతో విడిపోయా. అయితే శ్రీదేవి నాతో షేర్ చేసుకున్న విషయాలను బట్టి ఆ రోజు నేను ప్రపోజ్ చేసి ఉంటే వేరే ఉండేది. కానీ నేను ప్రపోజ్ చేయలేదు. దానికి రెండు కారణాలున్నాయి. శ్రీదేవి అంటే ఆరాధన భావన ఒకటైతే, అప్పుడే నా లైఫ్ లోకి ఊర్మిళ రావడం మరొకటి'' అని చెప్పారు .


By August 20, 2021 at 09:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-open-comments-on-private-meet-with-sridevi/articleshow/85478085.cms

No comments