Breaking News

లైంగిక దాడికి ప్రతిఘటించకుండా సమ్మతిస్తే రేప్ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు


లైంగిక వేధింపుల కేసులో దోషిగా నిర్దారణ అయి.. పదేళ్లు జైలు శిక్షపడిన వ్యక్తికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా తీర్పు చెప్పింది. మొదటిసారి లైంగిక వేధింపుల సమయంలో మహిళ ప్రతిఘటించకుండా సమ్మతిస్తే దానిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే మదురై జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుంటానని ఆ యువకుడు హామీ ఇవ్వడంతో సమ్మతితోనే యువతి లైంగిక చర్యల్లో పాల్గొందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతడు వాయిదా వేస్తూ వచ్చాడు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తిచేసిన మదురై మహిళా న్యాయస్థానం 2016లో అతడిని దోషిగా నిర్దారించి, పదేళ్ల జైలు శిక్ష విధించింది. ‘ట్రయల్ కోర్టు విచారణ సమయంలో తాను అతడితో ప్రేమలో పడ్డానని, తరుచూ కలిసేవారమని చెప్పింది.. వారి సంబంధం దాదాపు రెండున్నరేళ్లు కొనసాగిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీపై వెనక్కు తగ్గడంతోనే కేసు పెట్టినట్టు గమనించామని మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఆర్ పొంగియప్పన్ అన్నారు. తన సోదరుడి వివాహం జరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు పరిస్థితులు వెల్లడించాయి.. ఈ వాగ్దానం తర్వాత కూడా ఆ మహిళ అతడితో తన సంబంధాన్ని కొనసాగించింది.. ఆమెను వివాహం చేసుకోవడానికి అప్పీలుదారు ఖచ్చితమైన తేదీ లేదా ఏదైనా సమయం ఇచ్చినట్లు ఆధారాలలో ఎక్కడా లేవు.. చివరికి ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి త్వరగా చేసుకుందామని పట్టుబట్టడటంతో గర్భస్రావం చేసుకోవాలని అప్పీలుదారుడు సూచించారు. ఆ ప్రతిపాదనను ఆమోదించని ఆమె తనకు ఇచ్చిన వాగ్దానాన్ని తిరస్కరించాడు కాబట్టి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అందువల్ల ఈ మహిళ పూర్తి వాస్తవాలతోనా లేదా విరక్తితో పోలీసులను సంప్రదించిందా? అనే దానిపై తమకు సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అనంతరం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా ప్రకటించింది.


By August 30, 2021 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/non-raising-of-resistance-during-sexual-assault-amounts-to-pre-consent-madras-high-court/articleshow/85755282.cms

No comments