Breaking News

చచ్చిపోయే పరిస్థితి.. నోట మాట రాలేదు.. ఫస్ట్‌టైమ్ చిరంజీవికి ఫోన్ చేస్తే! బండ్ల గణేష్ ఎమోషనల్


పవన్ కళ్యాణ్ భక్తుడినని ఓపెన్‌గా చెప్పుకునే .. మెగా ఫ్యామిలీ అంటే పడిచచ్చిపోతారు. మెగా హీరోలైన , పవన్ కళ్యాణ్‌లను ఎప్పుడూ గుండెల్లోనే పెట్టుకుంటారు. అంతేకాదు ఏ చిన్న సందర్భం దొరికినా ఆ హృదయ ద్వారాలు తెరిచి కట్టలు తెంచుకునేలా తనలో ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. స్పెషల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడే తీరు, చేసే కామెంట్స్ ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ సీక్రెట్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు బండ్ల గణేష్. కమెడియన్ టు ప్రొడ్యూసర్‌గా రాణించి ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ఆరంగేట్రం చేసిన బండ్ల గణేష్.. నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ పలు ఇంటర్వ్యూలతో జనాల్లో హాట్ టాపిక్‌ అవుతున్నారు. దీంతో ఆయన నుంచి ఎన్నో విషయాలను రాబట్టేందుకు మీడియా వర్గాలు ముందడుగేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇష్యూపై ఆయన ఓపెన్ అయ్యారు. కరోనాకు సంబంధించిన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను రెండోసారి కరోనా బారిన పడిన సమయంలో ఆరోగ్యం క్షీణించిందని, ఒక్కరోజు ఆలస్యమైనా కూడా తన ప్రాణాలు పోయేవని.. అలాంటి కఠిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనకు అండగా నిలిచారని బండ్ల గణేష్ అన్నారు. మెగాస్టార్ లేకపోయి ఉంటే తాను ఈ రోజు ప్రాణాలతో ఉండే వాడిని కాదని తెలిపారు. తనతో పాటు తన ఇంట్లో వాళ్లందరికీ కరోనా సోకిందని, ఆ సమయంలో కనీసం ఆసుపత్రిలో బెడ్ కూడా దొరకని పరిస్థితి ఉందని చెప్పిన ఆయన.. పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేయాలని అనుకుంటే అప్పుడు ఆయన కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నారని తెలిసి చేయలేకపోయానని అన్నారు. చివరకు చిరంజీవి గారికి ఫస్ట్‌టైమ్ చేశానని, నోట మాట కూడా రాని ఆ పరిస్థితుల్లో ఆ ఒక్క ఫోన్ కాల్‌తో చిరంజీవి ఎంతో సాయపడ్డారని బండ్ల గణేష్ తెలిపారు. చిరంజీవి చేసిన ఆ సాయంతోనే ఇవ్వాళ మీ ముందు ఉన్నాను తప్ప, లేకుంటే వేరేలా ఉండేదని అన్నారు. పవన్ కళ్యాణ్ నాకు ఒక జీవితాన్ని ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని ఆయన చెప్పడం విశేషం. ఆ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటానని తెలుపుతూ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.


By August 25, 2021 at 08:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-help-bandla-ganesh-emotional-comments-on-corona-situation/articleshow/85613852.cms

No comments