వర్షం కురిసిన ఓ రాత్రి.. ఆ ఇద్దరికీ కాల్ చేస్తే ఓకే అన్నారు! సీక్రెట్ రివీల్ చేసిన ప్రియాంక చోప్రా
ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటంలో ముందువరుసలో ఉంటుంది గ్లోబల్ బ్యూటీ . తన లైఫ్‌కి సంబంధించిన ఏ ఒక్క విషయాన్నీ దాచుకోకుండా అన్నీ బయటపెట్టేయడం ఆమె నైజం. ఈ మేరకు తన ఆత్మకథ `అన్ ఫినిష్డ్` అనే పేరుతో ఓ బుక్‌ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్న ప్రియాంక.. తాజాగా 'ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి ఆలోచన' అంటూ ఓపెన్ అయింది. సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలంటే హీరోలతోనే వస్తాయి. మరి అదే మల్టీస్టారర్ మూవీ కేవలం హీరోయిన్లతో వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన తట్టిందట ప్రియాంకకు. అది కూడా 2019 నవంబరులో ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి ఆలోచనట. ముగ్గురు హీరోయిన్లతో మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందనే థాట్ మైండ్‌లో మెదిలిందట. దీంతో వెంటనే ఫోన్ తీసుకొని తన ఇద్దరు స్నేహితులు , ఆలియాలకు కాల్ చేసి విషయం చెప్పేసిందట. దానికి వాళ్ళు కూడా రెడీ అనడంతో ఓ భారీ లేడీ మల్టీస్టారర్ సినిమాకు అలా బీజం పడిందట. ఈ విషయాన్ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది ప్రియాంక చోప్రా. 'జీలే జరా' పేరుతో ఈ భారీ లేడీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని, రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేయనున్నారని ప్రియాంక పేర్కొంది. నిజానికి ఈ సినిమాను 2020 ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి తీసుకురావాలని డిసైడ్ కాగా, పరిస్థితులు అనుకూలించక పోవడంతో వాయిదా వేశారని, వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఆమె తెలిపింది. 2011లో వచ్చిన ‘డాన్ 2’ తర్వాత ఫర్హాన్ డైరెక్ట్ చేస్తున్న హిందీ సినిమా ఇదే కావడంతో బీటౌన్ జనాల్లో సినిమా పట్ల ఆతృత మొదలైంది. ముగ్గురు బ్యూటీలు తెర పంచుకోవడమంటే అంతకన్నా థ్రిల్ ఇంకేముంటుంది చెప్పండి!.
By August 11, 2021 at 08:40AM
No comments