కింగ్ సైజ్ ఎంటర్‌టైనర్ ఈ గాడ్ ఫాదర్.. చిరంజీవికి ప్రముఖుల విషెస్.. వెల్లువలా శుభాకాంక్షలు
చిరంజీవి.. ఈ పేరు వింటే చాలు జనాల్లో ఓ రకమైన ఉత్సాహం ఉరకలేస్తుంది. స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగి అందరివాడు అనిపించున్న ఈ మెగాస్టార్ నేటికీ సినీ కళామతల్లికి సేవలందిస్తున్నారు. బాక్సాఫీస్ షేక్ చేయడం కొత్తేమీ కాకపోయినా నేటితరం కుర్ర హీరోలతో కూడా పోటీపడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ రారాజుగా వెలుగొందుతున్న ఆయనకు కోట్లాదిమంది అభిమానాలుండగా.. సినీ ఇండస్ట్రీలో అంటే ఇష్టపడే ప్రముఖులు బోలెడంతమంది ఉన్నారు. అయితే ఈ రోజు (ఆగస్టు 22) ఈ '' పుట్టినరోజు కావడంతో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బెస్ట్ విషెష్ పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు అభిమాన వర్గాలు పండగ చేసుకుంటూ ట్విట్టర్‌లో మోత మోగిస్తున్నాయి. నయనతార, మెహర్ రమేష్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, వెన్నెల కిషోర్, శ్రీను వైట్ల ఇలా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ చిరంజీవికి బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ ఓ శిఖరం అని, కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని, ఆయన ఎందరికో ఆదర్శం అని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
By August 22, 2021 at 08:21AM
No comments