Breaking News

బ్రేకింగ్: అర్ధరాత్రి వేళ నిహారిక ఇంట్లో రచ్చ.. పెద్ద గొడవ కావడంతో చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు


మెగా డాటర్, నాగబాబు కుమార్తె రీసెంట్‌గా పెళ్లి చేసుకొని అత్తారింట్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను ఆమె పెళ్లాడింది. గతేడాది డిసెంబర్ నెలలో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌లో ఘనంగా జరిగింది. ఆ తర్వాత భర్తతో కలిసి రొమాంటిక్ టూర్స్ వేస్తున్న నిహారిక.. నిత్యం వార్తల్లో నిలుస్తుండటం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే నిహారిక దంపతులకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తాజాగా బయటకు రావడంతో క్షణాల్లోనే ఇది వైరల్ అయింది. నిహారిక భర్త చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. దీంతో అంతా ఈ ఇష్యూ గురించే చర్చించుకుంటున్నారు. ఉన్నటుండి ఈ షాకింగ్ న్యూస్ ఏంటి? అసలేం జరిగింది అనే దానిపై ఆరా దీస్తున్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నిహారిక ఇంట్లో అర్ధరాత్రి వేళ పెద్ద రచ్చనే నడిచిందని తెలుస్తోంది. ఇంట్లో పెద్ద గొడవ జరగడంతో.. ఆమె భర్త న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‏మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త కూడా అపార్ట్‏మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేయడంతో ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.


By August 05, 2021 at 08:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/breaking-police-cese-on-niharika-husband-chaitanya/articleshow/85058118.cms

No comments