Breaking News

Bheemla Nayak On Fire.. కాల్చి అవతల పారేసిన పవర్ స్టార్.. దానిపై క్లారిటీ!


పాత్రలో పవర్ స్టార్ విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మాటల మాంత్రికుడు మార్పులు చేర్పులు చేసేశారు. ఇక సాగర్ చంద్ర తన ప్రతిభకు పదునుపెడుతూ పవన్ కళ్యాణ్‌ను ఇది వరకెన్నడూ చూడని యాక్షన్ మోడ్‌లో చూపించేశారు. భీమ్లా నాయక్ అంటూ వదిలిన గ్లింప్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. పవర్ స్టార్ దెబ్బకు సోషల్ మీడియాలో రికార్డులన్నీ బద్దలయ్యాయి. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని రూమర్లు వచ్చాయి. దీనిపై చిత్రయూనిట్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఆచార్య సంక్రాంతి బరిలోకి రానుందని, అందుకోసం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వాయిదా పడిందని, రిపబ్లిక్ డేకు రాబోతోందంటూ టాక్ బయటకు వచ్చింది. అయితే వీటిపై చిత్రయూనిట్ పరోక్షంగా స్పందించింది. అసలు విషయాన్ని చెప్పేసింది. భీమ్లా నాయక్ మోడ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ గన్నుతో చెలరేగిపోయారు. రూమర్లను గన్నుతో కాల్చి పడేస్తున్నట్టుగా ఉంది. ఇందులో ఏకే 47తో పవన్ కళ్యాణ్ కనిపించారు. యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు.. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు.. నాయకుడు ఈ రెండింటిని భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు అంటూ చిత్రయూనిట్ ఓ పోస్టర్, గ్లింప్స్‌ను వదిలింది. ఇందులో జనవరి 12న భీమ్లా నాయక్ రాబోతోన్నారని చెప్పింది.


By August 21, 2021 at 10:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-bheemla-nayak-new-glimpse/articleshow/85507930.cms

No comments