Breaking News

Afghanistan ఆందోళనకరంగా అఫ్గన్ పరిణామాలు.. పాక్, చైనాలపై విరుచుకుపడ్డ భారత్


అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా భారత్ తమ ఆందోళనను వ్యక్తం చేసింది. ‘ఉగ్రవాద చర్యల వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు’ అనే అంశంపై గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చను చేపట్టారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొని ప్రసంగించారు. ‘ లేదా భారతదేశానికి వ్యతిరేకంగా లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాదులు శిక్షార్హమైన నేరాలను ప్రోత్సాహిస్తున్నాయి.. పెరుగుతున్న నిషేధిత హక్కానీ నెట్‌వర్క్ కార్యకలాపాలు మా ఆందోళనను సమర్ధిస్తున్నాయి’ అని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. ‘మా సమీప పరిసరాల్లోని ISIL-Khorasan (ISIL-K) మరింత శక్తివంతంగా మారింది.. విస్తరించేందుకు అది నిరంతరం ప్రయత్నిస్తోంది.. ఆఫ్గన్‌లో జరుగుతున్న సంఘటనలు సహజంగానే ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, వాటి ప్రభావాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను పెంచాయి’ అని అన్నారు. ‘కోవిడ్‌ ఎంత నిజమైంది.. ఉగ్రవాదం కూడా వాస్తవం.. మనమందరం సురక్షితంగా ఉండే వరకు ఎవరూ సురక్షితంగా లేరు ... కానీ, కొన్ని దేశాలు మన సమిష్టి నిర్ణయాన్ని బలహీనపరుస్తాయి’అని మంత్రి అన్నారు. ఈ సందర్బంగా తాలిబన్ల విషయంలో చైనా, పాకిస్థాన్ వైఖరిపై పరోక్షంగా చురకలంటించారు. ‘తాలిబన్‌లు అఫ్గన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ భద్రతా పరిస్థితి వేగంగా క్షీణిస్తోంది.. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ సహా ఈ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహిస్తోంది.. ముష్కరులకు పాక్ సురక్షిత స్థావరంగా మారింది’ అన్నారు. ప్రతినిధులు చైనాలో పర్యటించి.. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీని కలిసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ముష్కర మూకలకు ఆతిథ్యం ఇచ్చిన చైనా డబుల్ స్టాండ్ ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ‘‘అమెరికా, నాటో దళాలు హడావుడిగా ఉపసంహరించుకోవడం వాస్తవానికి అఫ్గన్ పట్ల యుఎస్ విధానం వైఫల్యాన్ని సూచిస్తుంది.. అఫ్గన్ ప్రజలు ఇప్పుడు జాతీయ స్థిరత్వం, అభివృద్ధిని సాధించడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఏర్పడింది’’ అని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల తాలిబన్లను భారత్ సంప్రదించిందా? అని అడిగిన ప్రశ్నకు జయశంకర్ స్పందిస్తూ.. ‘‘ఈ సమయంలో మేము కాబూల్‌లో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితిని గమనిస్తున్నాం.. తాలిబన్‌లు, వారి ప్రతినిధులు కాబూల్‌కు వచ్చారు.. ఈ విషయంలో మేము నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’’ అని సమాధానం ఇచ్చారు.


By August 20, 2021 at 07:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-slams-pakistan-state-hospitality-for-terror-groups-amid-afghanistan-concerns/articleshow/85475971.cms

No comments