Breaking News

విమానం గాల్లో ఉండగా పేలిపోయిన సామ్‌సంగ్ గేలాక్సీ ఏ21.. అత్యవసర ల్యాండింగ్


విమానం గాల్లో ఉండగానే సామ్‌సంగ్ మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగడంతో విమానం అత్యవసరంగా దిగిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానంలో రెండు రోజుల కిందంట చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్‌లో మంటలు చేలరేగడంతో విమానాన్ని సీటేల్-టకోమా అంతర్జాయతీ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపి.. అందులో 128 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందిని ఖాళీ చేయించారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అలస్కా 751 విమానం.. 128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్‌ నుంచి సీటెల్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న సామ్‌సంగ్ గేలాక్సీ ఏ21 స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మంటలు అదుపు చేసి, సీటెల్‌-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించారు. ప్రయాణికులతో పాటు సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. అనంతరం ఘటనపై దర్యాప్తు జరిపిన సిబ్బంది.. ఆ స్మార్ట్‌ఫోన్‌ పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించారు. స్మార్ట్‌ఫోన్‌ గుర్తించలేనంతగా కాలిపోవడంతో అది గేలాక్సీ 21ఏ మొబైల్ అని ప్రయాణికుడు వెల్లడించాడు. ఫోన్ పేలిపోవడానికి కారణాలు తేలియకపోయినా.. గేలాక్సీ ఏ21లో ఇలా మంటలు చెలరేగడం ఇదే తొలిసారి. మంటలు చెలరేగడంతో వెంటనే క్యాబిన్ క్రూ.. బ్యాటరీ కంటెయిన్‌మెంట్ బ్యాగు సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు బ్యాగులోని గేలాక్సీ జే5 స్మార్ట్‌ఫోన్ పేలిపోయిన విషయం తెలిసిందే.


By August 26, 2021 at 09:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/passengers-on-a-alaska-plane-in-us-evacuated-after-phone-reportedly-caught-fire/articleshow/85646174.cms

No comments