Vishal : తండ్రైన హీరో ఆర్య.. ఈ విషయాన్ని దాచుకోలేకపోతోన్న.. విశాల్ ఎమోషనల్
ఆర్య, ఎంతంటి సన్నిహితులో అందరికీ తెలిసిందే. వాడు వీడు అనే సినిమా దగ్గరి నుంచి వీరి స్నేహబంధం మరింత దగ్గరైంది. ఇప్పుడు కూడా కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. ఎనిమీ అనే చిత్రంతో , విశాల్ మరోసారి దుమ్ములేపేందుకు రెడీ అయ్యారు. అయితే విశాల్ తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో ఓ శుభవార్త విన్నాడట. ఈ విషయాన్ని తన మనసులో దాచుకోలేకపోయాడట. అందుకే ముందుగానే తానే బ్రేక్ చేస్తున్నానని అసలు విషయం బయటపెట్టేశారు. ఆర్య దంపతులకు శుక్రవారంనాడు పాప పుట్టింది. ఈ విషయాన్ని ముందుగా హీరో విశాల్ తన ట్వట్టర్ ద్వారా తెలియజేశారు. తాను మావయ్యను అయ్యానని, చాలా ఎమోషనల్‌గా ఉందని చెబుతూ విశాల్ ఆర్య, సయేషాలకు అభినందనలు తెలిపారు. తన స్నేహితుడు ఆర్య తండ్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడని ఈ సందర్భంగా విశాల్ అన్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా ఉండలేకపోతోన్నాను.. ఎంతో ఎమోషనల్‌గా ఉన్నాను.. ఎన్నో ఫీలింగ్స్ కలుగుతున్నాయి.. అందుకే బ్రేక్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే అభిమానులు ఇండస్ట్రీకి సంబంధించిన స్నేహితులు, ప్రముఖులు ఆర్య, సయేషా దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఆర్య, సాయేషాల ప్రేమ వ్యవహారం 2019లో వివాహా బంధంగా మారిన సంగతి తెలిసిందే. ఇక గురువారం తాను హీరోగా నటించిన సార్పట్ట పరంపర విడుదలై హిట్ అవ్వడం, ఇలా శుక్రవారం పాప పుట్టడంతో ఆర్యకు డబుల్ హ్యాపీ అయినట్టుంది.
By July 24, 2021 at 08:06AM
No comments