Breaking News

దారుణం.. 15 రోజులపాటు నలుగురు స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్ రేప్


రక్షణగా ఉండాల్సిన కట్టుకున్నవాడే తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్బంధించి పదిహేను రోజులపాటు ఆమెపై భర్తతో సహా ఐదుగురు ఆఘాయిత్యం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలని భార్యను చిత్రహింసలకు గురిచేసి, అనంతరం ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లాలో వెలుగుచూసింది. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటికి చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్షాయ్‌ ఘంజ్‌కు చెందిన బాధిత యువతికి.. అదే ప్రాంతానికి చెందిన నజీమ్‌తో వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలని ఆమెను చిత్రహింసలు పెట్టాడు. తాను చెప్పినట్టు చేయకపోవడంతో తలాక్ చెప్పాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితులు జుల్‌ఫికర్‌, జబ్బార్‌, సాజిమ్‌, అమీర్‌లతో కలిసి 15 రోజుల పాటు ఆమెకు నరకం చూపించాడు. భర్త చెర నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితురాలు.. తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో ఆమె వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కనౌజ్ ఎస్పీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని వివరించారు.


By July 24, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/husband-raped-wife-along-with-his-friends-throughout-15-days-in-kannauj/articleshow/84697773.cms

No comments