Sridevi Soda Centre Teaser: సోడాల శ్రీదేవి ఇక్కడ.. పగిలిపోద్ది! సుధీర్ బాబుకు పంచ్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో వైరల్
యంగ్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. 'అక్కడుంది లైటింగ్ సూరి బాబు.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది' అంటూ మాస్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు చెప్పకనే చెప్పేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోడాల శ్రీదేవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చిత్రంలో సుధీర్ బాబు సరసన నటిస్తున్న హీరోయిన్ 'సోడాల శ్రీదేవి'గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఇంట్రో వీడియోలో ఆమె లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'గోలి గొంతులోకి దిగుద్ది జాగత్త', 'ఒకడు సోడా సోడా అని మా కొట్టు దగ్గర తిరిగితే సోడా తీసి వాడి నెత్తిమీద కొట్టా. అప్పటినుంచి నా పేరు అయింది' అంటూ వచ్చిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి. ఇకపోతే ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న సుధీర్ బాబు.. ''తట్టుకోలేనంత కోపం, పట్టలేనంత ప్రేమ'' అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పలాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా తెరకెక్కుతోంది. 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 4గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెలోడి కింగ్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేశ్, హర్షవర్థన్, సప్తగిరి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
By July 30, 2021 at 10:33AM
No comments