మరింత ముదిరిన వివాదం.. మిజోరాం నుంచి వచ్చే వాహనాలపై అసోం కీలక ఆదేశాలు!
అసోం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం మరింత రాజుకుంది. రెండు రోజుల కిందట సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, మిజోరాం నుంచి అన్ని వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతించాలని అసోం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మిజోరాం నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి డ్రగ్స్ తరలిస్తున్నట్టు అసోం ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దుల్లో ఇటీవల ఘర్షణలకు డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడమే కారణమని ఆరోపించారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అసోం ప్రజల మిజోరాం వెళ్లడం అంత క్షేమంకాదని తాజా ఉత్తర్వుల్లో హెచ్చరించింది. రెండు నెలల్లోనే రాష్ట్రంలో 912 అక్రమ డ్రగ్స్ రవాణా కేసులు నమోదుచేసి 1,560 మందిని అరెస్ట్ చేశామని పేర్కొంది. మిజోరాం నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం ఉందని నిందితుల అసోం సీనియర్ పోలీస్ అధికారి జీపీ సింగ్ ట్విట్ చేశారు. జాతీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రజలు దీనికి సహకరించాలని ఆయన కోరారు. ‘డ్రగ్స్ అక్రమ రవాణాపై జరుగుతున్న దర్యాప్తులో చాలా మట్టుకు అసోంలోకి మిజోరాం సరిహద్దుల నుంచే వస్తున్నట్టు తమ పరిశీలనలో వెల్లడయ్యింది.. ప్రభుత్వం పేర్కొంది. మిజోరాం గుండా జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా సమాజానికి ముప్పుగా పరిణమించింది’ అని తెలిపారు. అసోం-మిజోరాం సరిహద్దుల్లోని అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని వివరించారు. వాహనాల్లో ఎటువంటి డ్రగ్స్ లేని అధికారులు నిర్ధారించిన తర్వాతే అనుమతిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, అసోం ఉత్తర్వులపై మిజోరాం అధికారికంగా స్పందించలేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసోం ద్వారా రోడ్డు మార్గంలో దేశంలోని మిగతా ప్రాంతాలకు వెళ్లే మిజోరాం ప్రజలను వేధించడమేనని మండిపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత అసోం-మిజోరాం సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోగా.. మరో 80 మంది గాయపడ్డారు. వీరిలో అసోం ఎస్పీ ఒకరు ఉన్నారు. సరిహద్దులోని వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు దారితీసింది. సరిహద్దు సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపి వెళ్లిన మర్నాడే ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం. కచార్ జిల్లాలో మేఘాలయ వైపు నుంచి అల్లరిమూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసులు ఆరుగురు మృతి చెందారు. సరిహద్దుల్లో చోటుచేసుకున్న కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో కచార్ జిల్లా ఎస్పీ నింబాల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా 50 మంది సిబ్బంది గాయపడ్డట్టు అసోం పోలీసు విభాగం తెలిపింది.
By July 30, 2021 at 11:22AM
No comments