Breaking News

Rajasthan: రియల్ కుంభకర్ణుడు.. ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే..


మనిషికి తిండి, నీరు, గాలి మాదిరిగానే నిద్ర కూడా అత్యవసరమే. ఒక్కరోజు నిద్రపోకపోతేనే శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోవడంతో పాటు అనారోగ్యానికి గురవుతుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు, వైద్య నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే ఆధునిక కాలంలో మనిషి నిద్ర సమయంలో క్రమంగా తగ్గిపోతోంది. ఉద్యోగ, వ్యాపారాలపైనే ఫోకస్ పెడుతున్న నేటితరం నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చెప్పొచ్చు. అయితే ఎవరైనా ఎక్కువ సమయం నిద్రపోతుంటే అతడిని కుంభకర్ణుడితో పోలుస్తుంటారు. అలాంటి రామాయణంలోనే కాదు నేటి భారతంలోనూ ఉన్నాడండోయ్... రాజస్థాన్‌కి చెందిన పూర్ఖారామ్ అనే వ్యక్తి సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతూనే గడిపేస్తాడట. అతడికి అతినిద్ర 23ఏళ్ల క్రితం మొదలైందట. మొదట్లో రోజుకు 18 గంటలు పడుకుని లేచే పూర్ఖారామ్.. ఆ తర్వాత 5-7 రోజులకోసారి నిద్రలేచేవాడట. ఇప్పుడు ఏకంగా నెలలో 20-25 రోజులు నిద్రపోతేనే ఉంటున్నాడట. ఎప్పుడైనా నిద్ర మేల్కోని ఏదైనా పని చేయాలంటే అతడి శరీరం సహకరించదు. ఇలా సంవత్సరానికి సగటున 300 రోజుల నిద్రలోనే గడుపుతున్నట్లు పూర్ఖారామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై అతడి భార్య లిచ్మి దేవి మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా సమస్య ఏంటో నిర్ధారించలేకపోతున్నారని తెలిపింది. కొంతమంది ఈ వ్యాధిని హైపర్సోమ్నియాగా తేల్చినా సరైన చికిత్స చేయలేకపోతున్నారని వెల్లడించింది. ఈ సమస్య కారణంగా పూర్ఖారామ్‌కు చుట్టుప్రక్కల వారు కుంభకర్ణుడు అని పేరు పెట్టారు.


By July 14, 2021 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-man-sleeps-300-days-in-a-year-like-kumbhakarna-he-sufferes-from-raredisease/articleshow/84397095.cms

No comments