Breaking News

Pushpa : అది మాత్రం చెప్పలేను.. ఎంతో తృప్తిగా ఉంది.. డైరీతో రష్మిక మందన్నా గుట్టురట్టు!


డైరీ రాయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. డైరీ అంటే ఎవ్వరికీ చూపించుకుండా పర్సనల్‌గా రాసేది కాదు. రష్మిక రాసే డైరీ అందరికీ చూపించేది. తన ఇన్ స్టాగ్రాం స్టోరీలో తాను ఆ రోజు చేసిన పనులన్నీ చెబుతుంది. ఎప్పుడు లేచింది.. లేచాక చేసిన పనులు.. పర్సనల్, ప్రొఫెషనల్ మ్యాటర్స్ అన్నీ కూడా రివీల్ చేస్తుంది. టైం పాస్ ఎలా చేస్తుంది.. తన పెట్స్‌ను ఎలా చూసుకుంటుందో చెబుతుంటారు. అలా జూలై మొదటి తారీఖున తన డైరీ అంటూ కొన్ని విశేషాలను పోస్ట్ చేశారు. మళ్లీ ఇంత వరకు డైరీ గురించి చెప్పలేదు. తాను రోజూ చేస్తున్న కార్యకలాపాల గురించి అభిమానులకు ఎలాంటి అప్డేట్లు ఇవ్వలేదు. తాజాగా రష్మిక మందన్నా మళ్లీ డైరీ అంటూ రచ్చ చేశారు. నిన్న తాను చేసిన పనుల గురించి క్లియర్‌గా చెప్పారు. అందులో ఎక్కువగా పుష్ప సినిమా గురించే ఉంది. నిన్న పుష్ప షూటింగ్‌లో పాల్గొన్నట్టు చెప్పుకొచ్చారు. ‘డియర్ డైరీ.. మళ్లీ నిన్ను మిస్ చేసేశాను.. సారీ.. ఈ రోజు(జూలై 17) ఏం జరిగిందంటే.. ఈ రోజును ఎంతో త్వరగా ప్రారంభించాను. ఎందుకంటే షూటింగ్ ఉండటం వల్ల త్వరగా లేచాను.. రెడీ అయ్యాను.. అందుకే కరెక్ట్ టైంకి సెట్‌లో ఉండగలిగాను. కొన్ని రోజుల క్రితమే పుష్ప షూటింగ్ ప్రారంభమైంది. సెట్‌లోకి వెళ్లాను.. మేం మా లైన్స్ ప్రాక్టీస్ చేశాం.. రిహార్సల్స్ కూడా చేశాం.. పెద్ద సీక్వెన్స్‌ను ఎంతో ఉల్లాసంగా చేసేశాం. అదంతా సినిమా గురించి కాబట్టి నేను ఎక్కువగా చెప్పలేను. కానీ ఎంతో సంతృప్తిగా అనిపించింది. సాయంత్రం ఆరుగంటలకు ప్యాకప్ చెప్పేశాం. ఎంతో అలిసిపోయినా కూడా జిమ్‌కు వెళ్లాను. చిన్నగా వర్కవుట్ చేసేశాను. అక్కడ నా ట్రైనింగ్ మెంబర్స్‌లో ఒకరిది బర్త్ డే. కేక్ తెప్పించాను. కట్ చేయించాను.. అందరూ కేక్ తిన్నారు. కానీ నేను మాత్రం తినలేదు.ఆ ఒక్క విషయం తప్పా ఈ రోజంతా కూడా అద్బుతంగా గడిచింది. ఆ తరువాత ఇంటికి వచ్చాను.. పెట్స్‌తో ఆడుకున్నాను. నా ఫ్రెండ్స్‌ని కలిశాను.. ఇక చివరగా పడుకున్నాను’ అని అన్నింటి గురించి చెప్పేశారు.


By July 18, 2021 at 07:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-dairy-details-and-about-pushpa/articleshow/84515966.cms

No comments