Breaking News

Pooja Hegde: స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై పూజా హెగ్డే కామెంట్స్.. ఆయన వ్యక్తిత్వం అలాంటిదంటూ ఓపెన్


ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో హవా ఎక్కువగా నడుస్తోంది. వరుస అవకాశాలతో మంచి ఫామ్‌లో ఉంది బుట్టబొమ్మ. దక్షిణాది భాషల్లో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూనే బాలీవుడ్ తెరపై హంగామా చేస్తోంది. క్రేజీ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న ఆమె.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఓపెన్ అయింది. సల్మాన్‌ ఖాన్‌తో కలసి పూజా హెగ్డే 'భైజాన్‌' అనే మూవీలో నటించనుంది. అతిత్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో.. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ సల్మాన్‌తో సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా ఆతృతగా ఉందని చెప్పింది. సల్మాన్ ఖాన్ గురించి చెబుతూ.. లోపల ఒకలా, పైకి మరోలా కనిపించే వ్యక్తిత్వం ఆయనది కాదని చెప్పుకొచ్చింది. కొందరు వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు ముసుగు వేసుకొని బయట మరోలా కనిపిస్తుంటారు కానీ సల్మాన్‌ ఖాన్‌ అలాంటి వారు కాదని తెలిపింది. నిజాయితీగా, ముక్కుసూటిగా తమకు నచ్చినట్టు ఉండే మనిషి అని, అలా ఉండటం చాలా గ్రేట్‌, అలాంటి సల్మాన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది పూజా. పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రాబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ప్రభాస్ సరసన పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ 'రాధేశ్యామ్' సినిమా చేస్తోంది. రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న 'ఆచార్య'లో కూడా భాగమవుతోంది పూజా. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన ఆమె కనిపించనుంది. హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ మూవీ చేస్తోంది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.


By July 28, 2021 at 07:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pooja-hegde-says-about-salman-khan-behavior-with-others/articleshow/84812801.cms

No comments