Breaking News

చైనాలోనే మరో ప్రమాదకర వైరస్.. Monkey B virusతో వెటర్నరీ డాక్టర్ మృ తి


ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోనే పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. తాజాగా డ్రాగన్ కంట్రీలో మరో కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదకర ‘’బారినపడి ఓ వెటర్నరీ సర్జన్ చనిపోయినట్టు వీక్లీ జర్నల్ వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే తొలి మంకీ బి వైరస్ మరణం కావడం గమనార్హం. చనిపోయిన పశు వైద్యుడు వయసు 57 ఏళ్లని... ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో ఎవరికీ ఈ వైరస్ సక్రమించలేదని చైనా మీడియా పేర్కొంది. తన వృత్తిలో భాగంగా పశు వైద్యుడు రెండు చనిపోయిన కోతుల శరీరాలను మార్చిలో విచ్ఛిన్నం చేశాడని, ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారని పేర్కొంది. విరేచనాలు, వాంతులు ఇతన అనారోగ్య లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో మే 27న మృతిచెందాడు. పశువైద్యుడి మృతదేహానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ‘మంకీ బీ వైరస్’‌ను గుర్తించారు. ‘బీ’ వైరస్‌గా పిలిచే ‘మంకీ బీ వైరస్’ను తొలుత మకాక్యూ అనే జాతికి చెందిన కోతుల్లో గుర్తించారు. ఈ వైరస్ మనుషులకు సోకితే కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి.. మరణానికి దారితీసే ప్రమాదం ఉందని అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వివరించింది. వైరస్ బారినపడిన ఒక రోజు నుంచి మూడు వారాల్లో ఈ దీని లక్షణాలు బయటపడే అవకాశం ఉందని పేర్కొంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం, తలనొప్పి, అలసట వంటి సాధారణ వైరస్ లక్షణాలే దీనికి కూడా ఉంటాయి. ఈ వైరస్ సోకితే మరణాల రేటు అత్యధికంగా ఉంటుందని.. దాదాపు 70 నుంచి 80 శాతం చనిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. కానీ, మనిషి నుంచి మనిషికి ఇది సంక్రమించే అవకాశం చాలా తక్కువని సీడీసీ పేర్కొంది. పశు వైద్యులు, జంతు సంరక్షకులు, కోతులకు సంబంధించిన శాంపిల్స్‌ను ల్యాబ్స్‌లో పరీక్షించేవారు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని సీడీసీ వీక్లీ జర్నల్ పేర్కొంది. మంకీ బి వైరస్‌ను తొలిసారిగా 1932లో గుర్తించారు.


By July 20, 2021 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/first-human-infection-case-with-monkey-b-virus-dies-in-china/articleshow/84573095.cms

No comments