Breaking News

Mamata Banerjee నేడు ఢిల్లీకి బెంగాల్ సీఎం.. కాంగ్రెస్, టీఎంసీ పొత్తుపై సంకేతాలు!


కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నానికి పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుడుతున్నారు. పెగాసిస్ స్పేవేర్ ఉదంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా.. మమతా బెనర్జీ ఢిల్లీకి పయనమవుతున్నారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ఇతర సీనియర్ నాయకులను ఆమె కలవనున్నారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మరోసారి ఖేలా హోబే (ఆట మొదలయ్యింది) నినాదం మొదలుపెట్టింది. పెగాసస్ హ్యాకింగ్ బాధితుల జాబితాలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఉండటంతో మమతా మండిపడ్డారు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ సైతం ఆరోపించింది. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ట్వీట్ చేసింది. దీదీ ఢిల్లీకి వస్తున్న ముందు రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. దీంతో కాంగ్రెస్, టీఎంసీలు ఒకే తాటిపైకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీని కలిసిన తరువాత కాంగ్రెస్, టీఎంసీ నేత డెరక్ ఓబ్రెయిన్ ట్విట్టర్ పోస్ట్ మరింత బలాన్నిస్తోంది. జూలై 18 న జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ఫిరాయింపులకు సంబంధించిన 10 వ షెడ్యూల్‌తో సహా పలు అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూలై 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆమె మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన ‘ఖేలా హోబ్’ నినాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. బీజేపీని గద్దె దించే వరకు కొనసాగుతోందని ప్రకటించారు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత కాంగ్రెస్ సీనియర్ నేతలు చిదంబరం, దిగ్విజయ సింగ్ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో టీఎంసీ వర్చువల్ ర్యాలీకి హాజరయ్యారు. త్వరలో బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించే మెగా ప్రతిపక్ష ర్యాలీకి సోనియా గాంధీ సహా సీనియర్ నాయకులను ఆహ్వానించనున్నట్టు మమతా వెల్లడించారు. ఢిల్లీ రాజకీయాల దిశగా అడుగేస్తున్న దీదీ.. మరింత దూకుడు పెంచనున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయెన్‌ వెల్లడించారు. పార్లమెంటరీ పార్టీని మార్గదర్శనం చేయడంలో ఆమెకు ఎంతో అనుభవం ఉన్నందునే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మమతా బెనర్జీ పార్లమెంట్‌ సభ్యురాలు కాకపోయినా ఆమెను పార్లమెంటరీ పార్టీ ఛైర్‌ పర్సన్‌గా నియమించారు.


By July 26, 2021 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tmc-congress-ties-warm-up-as-west-bengal-cm-mamatas-delhi-trip-starts-today/articleshow/84748557.cms

No comments