Breaking News

Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్ నటి జయంతి కన్నుమూత


సీనియర్ నటి (76) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేటి ఉదయం (సోమవారం) తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సౌత్ ఇండియన్ భాషల్లో 500 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1960, 70 దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది జయంతి. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పి ప్రత్యేకత చాటుకునేది జయంతి. కన్నడ ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటిగా ఆమెకు గుర్తింపు లభించింది. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్‌, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. లెజెండరీ యాక్టర్స్ ఎంజీఆర్, రాజ్ కుమార్, ఎన్టీఆర్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్న జయంతి తన కెరీర్‌లో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ''స్వాతికిరణం, శాంతి నివాసం, శ్రీదత్త దర్శనం, జస్టిస్‌ చౌదరి, రాజా విక్రమార్క, కొదమ సింహం, దొంగమొగుడు, కొండవీటి సింహం, అల్లూరి సీతారామరాజు, శ్రీరామాంజనేయ యుద్ధం, శారద, దేవదాసు'' వంటి అనేక చిత్రాల్లో జయంతి నటించారు.


By July 26, 2021 at 09:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actress-jayanthi-passes-away/articleshow/84748591.cms

No comments