Kewal Tamang : బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితి!.. కాపాడండని వేడుకుంటున్న ప్రియమణి
ఇప్పుడు వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అన్ని చోట్లా తన హవాను చూపిస్తున్నారు. బుల్లితెరపై జడ్జ్‌గా అదరగొడుతూనే..వెండితెరపై అద్భుత పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఓటీటీలో ప్రియమణి చేస్తోన్న రచ్చ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రియమణి ఓ పోస్ట్ చేశారు. ఇందులో తన ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు సాయం చేయండి అంటూ వేడుకున్నారు. ఢీ కంటెస్టెంట్లలో ఒకరైన తమంగ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రాణాలు కాపాడేందుకు సాయం చేయమని ప్రియమణి అందరినీ వేడుకుంటున్నారు. మరో వైపు ఢీ ఫేమ్ సైతం తన అసిస్టెంట్ కేవల్ కోసం ప్రార్థిస్తున్నారు. రక్తదానం చేయండి అంటూ అందరినీ వేడుకున్నారు. ఈ మేరకు ఆయన షేర్ చేసిన వీడియో అందరినీ కదిలిస్తోంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా అసిస్టెంట్ కేవల్ మీ అందరికీ తెలుసు. అతను ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడికి వేలూరులోని సీఎంసీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్జెంట్ పన్నెండు మంది బ్లడ్ ఇవ్వాల్సి ఉంది. దాని కోసం ఇక్కడి నుంచి మేం బయల్దేరుతున్నాం. కానీ తిరుపతి, చెన్నై, బెంగూళరు ఇలా అక్కడ దగ్గర్లో ఉన్న వారు ఎవరైనా సాయం చేయండి. వెళ్లి రక్తాన్ని ఇవ్వండి. మీకు మిగతా సమాచారాన్ని చెబుతాను. ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. ప్లీజ్ అతని కోసం ప్రార్థించండి’ అని అన్నారు. ఇక ప్రియమణి సైతం తన ఫ్రెండ్ కోసం చేతనైన సాయం చేస్తోంది. కేవల్ తమంగ్‌ను కాపాడండి.. అర్జెంట్‌గా 12 మంది బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా.. ఎవ్వరైనా సరే 12 మంది రక్తాన్ని ఇవ్వండి. అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన్ను ప్రస్తుతం వేలూరులోనీ సీఎంసీ హాస్పిటల్‌లో ఉన్నారు. దయచేసి కేవల్‌ను కాపాడండి అని ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేస్తూ దండం పెట్టేశారు.
By July 29, 2021 at 12:23PM
No comments