Breaking News

HBD Sanjay Dutt: సీనియర్ నటుడుకి బర్త్ డే గిఫ్ట్.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన కేజీఎఫ్ టీమ్


బాల నటుడుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత రాకీ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు . ఆయన జీవితంలో ఎన్ని విజయాలు ఉన్నాయో.. అన్ని వివాదాలు ఉన్నాయి. ప్రముఖ సినీ నటుడు సునీల్ దత్, నర్గీస్ దత్‌ల కుమారుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆయనా.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సాజన్, ఖల్‌నాయక్, వాస్తవ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్ తదితర సినిమాలతో ఆయన ప్రేక్షకులను ఎంతో అలరించారు. అయితే 1993లో సంజయ్ దత్ జీవితంలో ఓ ఊహించని మలుపు చోటు చేసుకుంది. ముంబై పేలుళ్ల కేసులో ఉగ్రవాదులకు సహకారం అందించారనే కారణంతో ఆయన ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. 2018లో సంజయ్ దత్ జీవితగాధ ఆధారంగా రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సంజూ’ అనే సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక గత ఏడాది ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడ్డారు. అయితే మెరుగైన వైద్యం అందడంతో సంజయ్ క్యాన్సర్‌ను జయించారు. కాగా, సంజయ్ దత్ నేడు (జూలై 29) తన 62వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సహ నటీనటులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘’. ఈ సినిమాలో ఆయన ప్రధాన విలన్ ‘అధీరా’ పాత్రలో కనిపించనున్నారు. అయితే సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సంజయ్ దత్ ఓ పెద్ద ఖడ్గం పట్టుకొని నిలుచొని ఉన్నారు. చూస్తుంటే ఇది ఓ భారీ ఫైట్ సీన్‌లో సన్నివేశంలా తెలుస్తోంది. ‘యుద్ధం అంటే అందులో పురోగతి ఉండాలి.. నేను చెప్పేదాన్ని రాబందులు కూడా ఒప్పుకుంటాయి’ అని అధీరా చెబుతారు అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక కన్నడ రాక్‌స్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హోంబులే ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రవీనా టండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


By July 29, 2021 at 11:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kgf-chapter-2-team-release-special-poster-on-sanjay-dutt-birthday/articleshow/84850354.cms

No comments