Breaking News

Charmme Kaur : చివరకు ఆయన పాద సేవ చేసుకుంటున్నా.. ఛార్మీ కామెంట్స్ వైరల్


హీరోయిన్, నిర్మాత అయిన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక ఛార్మీ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఛార్మీ సైతం మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కారు. నిర్మాతగా పూరి జగన్నాథ్, ఛార్మీలను మళ్లీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేట్టు చేసింది. అలా ఛార్మీ ఇప్పుడు లైగర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలా ప్రాజెక్ట్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు.ఎక్కువగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. అలా ఛార్మీ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంటారు. తన పర్సనల్ సంగతులు చెబుతూ, తన పెట్ గురించి విశేషాలు చెబుతూ ఉంటారు. వాటితో ఆడుకునే వీడియోలను షేర్ చేస్తుంటారు. మామూలుగా ఛార్మీ తన తల్లిదండ్రుల గురించి కొన్ని సందర్భాల్లోనే చెబుతుంటారు. గత ఏడాది వారు కరోనా బారిన పడటంతో ఆ విషయాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఛార్మీ పంచుకున్నారు. అయితే తాజాగా తన తండ్రి సేవలో ఛార్మీ మునిగారు. చివరకు ఆయన పాదాల దగ్గరికి చేరాను.. అంటూ కాళ్లు ఒత్తుతున్న వీడియోను షేర్ చేశారు. తానే కాకుండా తన పెట్‌తోనూ పాద సేవ చేయించేందుకు ప్రయత్నించారు. ఇక దీన్ని బట్టి ఛార్మీకి తన తండ్రి మీద ఎంతటి ప్రేమ ఉందనే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


By July 17, 2021 at 07:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/charmy-kaur-is-at-her-father-charno-me/articleshow/84491340.cms

No comments