బాలయ్యను చూసి భయపడ్డా.. సెట్లో ఆయన తీరు! ప్రగ్యా జైస్వాల్ ఓపెన్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలయ్య బాబుతో '' సినిమాలో నటిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్‌లో ఉంది. చిత్రంలో బాలయ్య బాబు డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నారు. అయితే తాజాగా బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఓపెన్ అయింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. సినిమాలో నటించే అవకాశం అనగానే చాలా భయమేసిందని, షూటింగ్ మొదలైనప్పుడు కూడా మొదట్లో ఆయనను చూస్తే భయపడేదాన్ని అని చెప్పిన ప్రగ్యా.. ఆయనతో కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఎంత సరదా మనిషి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదనేది అర్థమైందని చెప్పింది. సెట్లో కూడా చాలా హుషారుగా ఉంటూ సెట్ అంతా సందడి వాతావరణం నెలకొల్పుతుంటారని తెలిపింది. ఇక బాలయ్య గురించి బయట వినిపిస్తున్న మాటలకు, ఆయన క్యారెక్టర్ చాలా భిన్నం అంటోంది ప్రగ్యా. ఇకపోతే బాలయ్య చేస్తున్న 'అఖండ' సినిమాలో తనది ప్రాధాన్యతతో కూడిన రోల్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సారి కేవలం గ్లామర్ పాత్రకు పరిమితం కాలేదని, చిత్రంలో వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పింది. సినిమా కథలో కూడా తన పాత్రకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందని, ఇలాంటి సినిమా ఛాన్సులు చాలా అరుదుగా వస్తాయని కూడా వివరణ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఉందని, మూవీ ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. అంటే ఈ సినిమాతో తన కెరీర్ టర్న్ అవుతుందని భావిస్తున్న ఆమె.. భారమంతా బాలయ్య పైనే వేసేసిందని చెప్పుకోవచ్చు.
By July 27, 2021 at 07:51AM
No comments