Breaking News

అభిమానులకు గుడ్‌న్యూస్ అందించిన ఉపాసన కొణిదెల.. త్వరలోనే ఆమె సోదరి పెళ్లి


మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన.. నిత్యం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి చేత భేష్ అనిపించుకుంటోంది. సినీ నటి కాకపోయిన ఆమెకు అభిమానుల్లో అదే రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె చేసే సామాజిక సేవలకు ఎందో అభిమానులు ఉన్నారు. కష్టం ఉందంటే చాలు.. వారికి సహాయం అందించేందుకు ఉపాసన ఎప్పుడు ముందుంటారు. ఇక సోషల్‌మీడియా విషయానికొస్తే ఉపాసన చాలా యాక్టివ్‌గా ఉంటారు. రామ్ చరణ్ కంటే ఎక్కువగా ఆమె సోషల్‌‌మీడియాలో అభిమానులకు అప్‌డేట్స్ అందిస్తుంటారు. చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు.. తన సోషల్‌సర్వీస్, ప్రజల్లో అవగాహన కల్పించడం తదితర విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు మెగా అభిమానులతో, తన ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉండటం ఉపాసన నైజం. తాజాగా మెగా అభిమానులకు ఉపాసన గుడ్‌న్యూస్ అందించారు. తన సోదరి కామినేని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే విషయాన్ని ఆమె తాజాగా షేర్ చేశారు. అనుష్పాల అథ్లెట్ ఇబ్రహీంతో ప్రేమలో ఉంది. ఈ మధ్యే ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని అనుష్పాల స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించగా.. ఉపాసన కూడా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘నా డార్లింగ్స్‌కి అభినందనలు’ అంటూ ఆమె పేర్కొన్నారు. సెలబ్రిటీలు తమన్నా, కాజల్, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా భూపాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ జంటకు అభినందనలు తెలిపారు.


By July 18, 2021 at 12:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-sister-anushpala-engaged-with-athlete-armaan/articleshow/84519022.cms

No comments