నాకైతే అలాంటివి ఇష్టం లేదు.. సింపుల్‌గా 'నో' అనేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన నిధి అగర్వాల్
కెరీర్ పరంగా చూస్తే చాలా స్పీడ్‌గా పాపులర్ అయింది . నాగ చైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెంటనే అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' సినిమాలో రొమాన్స్ చేసింది. ఇక పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్' అమ్మడి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. హుషారెత్తించే పాటల్లో అందాల ఆరబోతకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా యమ జోష్‌లో చిందులేస్తుంటుంది నిధి. అయితే వినోదం పంచడంలో అన్నీ ఓకే కానీ, ఒక్క విషయంలో మాత్రం తన వల్ల కాదని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా సినిమాల్లో సాంగ్స్ అనేవి మేజర్ అసెట్. మ్యూజిక్, హీరోహీరోయిన్స్ డాన్స్ లాంటి అంశాలు ఇందులో చాలా ముఖ్యం. వీటితో పాటు పాటకు తగ్గ లొకేషన్స్ ఎంచుకొని అట్రాక్ట్ చేస్తుంటారు మేకర్స్. ఈ కోణంలో చాలా సినిమాల్లో వాన పాటలతో హూషారెత్తించారు. అయితే నిధి మాత్రం వాన పాటలు చేయనని చెబుతుండటం విశేషం. వాన పాటలంటే అస్సలు ఇష్టం లేదని చెబుతున్న ఆమె.. వాన పాటలు చేయడం అంత ఈజీ కాదని అంటోంది. వాన చినుకులు పడుతుంటే.. కళ్లు తెరిచి ఉంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, నటించటం తన వల్ల కాదని, వీలైనంత వరకు వాన పాటలకు దూరంగా ఉంటా అని ఓపెన్‌గా చెప్పేసింది నిధి అగర్వాల్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న '' సినిమాలో నటిస్తోంది నిధిఅగర్వాల్. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌తో నిధి మొట్టమొదటి సినిమా ఇదే. మరోవైపు తమిళ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు కొట్టేస్తోంది నిధి అగర్వాల్.
By July 26, 2021 at 07:50AM
No comments