పావురాలతో సందేశాల పంపుతున్నారా? బెయిల్ ఉత్తర్వుల అమలుపై చీఫ్ జస్టిస్ సంచలన వ్యాఖ్యలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/84493670/photo-84493670.jpg)
మంజూరైనా జైలు నుంచి ఖైదీల విడుదలలో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడింది. ఆయా రాష్ట్రాల్లోని ఎన్ని జైళ్లలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి, బెయిల్ పొందిన ఖైదీలను త్వరగా విడుదల చేయడానికి సౌకర్యాలను ఎప్పటిలోగా కల్పిస్తారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఖైదీల విడుదలలో జాప్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘బెయిల్ ఉత్తర్వులకు త్వరలోనే సురక్షితమైన ఓ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ మెకానిజమ్ రూపొందిచాలి.. దీని ద్వారా ఓ కేసులో బెయిల్ మంజూరయిన ఖైదీలను త్వరగా విడుదల చేయడానికి వీలుగా జైలు అధికారులకు నిర్దేశిత సమయంలో ఉత్తర్వులు చేరుకుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలోనూ బెయిల్ ఉత్తర్వుల అమలులో జైలు అధికారులు పావురాల ద్వారా సమాచారం వంటి పురాతన పద్ధతులపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను సెక్రెటరీ జనరల్ సంప్రదించి.. తక్షణమే ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టు, జైళ్లకు మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పాట్లు చేయాలని సూచించింది. జైళ్లలో కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి ఖైదీల వయస్సు, అనారోగ్య కారణాలు, ఇతర పరిస్థితుల ఆధారంగా వారిని విడుదలకు ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీలు వాటిని పరిగణనలోకి తీసుకున్నాయా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. దోషులుగా తేలి 14 ఏళ్లుగా అగ్రా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 13 మంది ముద్దాయిలకు సర్వోన్నత న్యాయస్థానం జులై 8న బెయిల్ మంజూరు చేసింది. ఈ ఖైదీలు నేరాలకు పాల్పడే సమయంలో ముద్దాయిలు మైనర్లుగా ఉన్నారని జువైనల్ జస్టిస్ బోర్డ్ నిర్ధారించింది. వీరు అప్పటికే 14 ఏళ్లు జైలు శిక్షను పూర్తిచేసుకోవడంతో విడుదలకు అనుమతించింది. కానీ, ఖైదీల విడుదలపై యూపీ జైలు అధికారులు జాప్యం చేయడంతో ఈ విషయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.
By July 17, 2021 at 09:41AM
No comments